వినోదం

టాలీవుడ్‌ నటుడు వేణు భార్య ఎవరో తెలుసా, ఆమె ఇప్పుడు ఏమి చేస్తుందంటే?

కామెడీ హీరోలలో వేణు తొట్టెంపూడి కూడా ఒకరు. దాదాపు 25కి పైగాసినిమాల్లో నటించిన వేణు పేక్షకులను అలరించారు. ముఖ్యంగా వేణు కామెడీ టైమింగ్ కు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. స్వయంవరం సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన వేణు మొదటి సినిమాకే నంది అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ సినిమాలో వేణు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.

ఆ తర్వాత తనకు నచ్చిన సినిమాల్లో నటిస్తూ తనదైన ముద్ర వేసుకున్నారు. ముఖ్యంగా వేణు నటించిన పెళ్ళాం ఊరెళితే, హనుమాన్ జంక్షన్, కుషి కుషీగా, చిరునవ్వులతో, స్వయంవరం లాంటి చిత్రాలు సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. అయితే ఆ తర్వాత వేణు మెల్లిమెల్లిగా సినిమాలకు దూరం అవుతూ వచ్చారు. మళ్లీ 2012లో ఎన్టీఆర్ హీరోగా నటించిన దమ్ము సినిమాలో కీలక పాత్రలో నటించి అలరించారు.

have you seen actor venu wife

ఆ తర్వాత దాదాపు 10 ఏళ్ళు దాటినా మళ్ళీ తెరపై కనిపించలేదు. కానీ వేణు రీ ఎంట్రీ ఇచ్చాడు. రవితేజ హీరోగా నటించిన‌ రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాలో ఓ కీలక పాత్ర పోషించాడు. కానీ ఈ సినిమా ప్లాప్ అయ్యింది. ఇది ఇలా ఉంటే వేణు సినిమాలకు దూరమై వైవాహిక జీవితంలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సినిమాలు చేస్తున్నప్పుడే అనుపమ చౌదరి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వీరికి కూతురితో పాటు, ఒక కుమారుడు కూడా ఉన్నారు. అనుపమ చౌదరి హీరోయిన్ లాంటి అందంతో తన భర్తకు చేదోడు వాదోడుగా ఉంటుంది. ఇక ఆమె భర్త, ఇద్దరు పిల్లలను చూసుకుంటూ గడిపేస్తుంది.

Admin

Recent Posts