ఉదయ్ కిరణ్ హీరోగా తొలి పరిచయం అయిన మూవీ చిత్రం. ఈ సినిమా ద్వారానే రీమా సేన్ కూడా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఉదయ్ కిరణ్, రీమాసేన్ నటించిన తొలిచిత్రమే మంచివిజయం సాధించడంతో ఇద్దరికీ స్టార్ గా గుర్తింపు వచ్చింది. ఆ తరవాత మనసంతా నువ్వే సినిమాలో కూడా ఉదయ్ కిరణ్ కు జోడీగా రీమాసేన్ నటించారు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించడంతో ఉదయ్ కిరణ్ కి రీమాసేన్ లక్కీ హీరోయిన్ అని పిలిచేవారు.
ఆ తర్వాత రీమాసేన్ చెలి, వీడే, అదృష్టం, బంగారం లాంటి సినిమాలలోనూ హీరోయిన్ గా నటించింది . 2006లో శింబు హీరోగా నటించిన వల్లభ సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్ లో కనిపించి అందర్ని ఆశ్చర్యపర్చింది. తెలుగు తో పాటు తమిళ్, హిందీ భాషల్లో కూడా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న రీమాసేన్ 2012లో ఓ బాలీవుడ్ సినిమాలో నటించి ఆ తరవాత సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. 2012లో శివ్ కరణ్ సింగ్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని వైవాహిక జీవితంలో బిజీ అయిపోయింది. రీమాసేన్ ప్రస్తుతం తన భర్త, కుమారుడు రణవీర్ సింగ్ తో హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తుంది.
ప్రస్తుతం రీమాసేన్ కి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఆ ఫోటో చూస్తే అప్పటి రీమాసేన్ ఇప్పుటి రీమాసేన్ ఒకరేనా అనే విధంగా మారిపోయింది. ఇటీవల కాలంలో రీమాసేన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. తనకు, తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేస్తుంటారు. తాను గోవాలో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను రీమా సేన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఆమె అభిమానులు మీరు చాలా మారిపోయారు అంటూ రీమాసేన్ కి కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకాలం తర్వాత మిమ్మల్ని చూడటం చాలా ఆనందంగా ఉంది. మరలా సినిమాల్లోకి ఎప్పుడు రీ ఎంట్రీ ఇస్తారు అంటూ అడుగుతున్నారు.