వినోదం

వామ్మో కొత్త బంగారు లోకం హీరోయిన్ ఇలా అయిపోయిందేంటి..?

కొత్త బంగారులోకం హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్ మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకుని ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది. అయితే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఇటీవల పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు చూస్తే అసలు గుర్తుపట్టని విధంగా మారిపోయింది. గ్లామర్ డోస్ లో కూడా చాలా మార్పులు వచ్చాయి. బీహార్ లో జన్మించిన శ్వేతా బసు ప్రసాద్ 2002 సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఇక ఈ బ్యూటీ చిన్నతనంలోనే కొన్ని టెలివిజన్ సీరియల్స్ లో కూడా నటించింది. ఇక గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఆమె కొన్నాళ్లపాటు జర్నలిస్టుగా కూడా వర్క్ చేసింది. ఇక మొదట్లోనే కమర్షియల్ యాడ్స్ ద్వారా గుర్తింపు అందుకొని పలు దర్శక నిర్మాతలను ఆకర్షించే ప్రయత్నం చేసింది.

2005లో తొలిసారి ఇక్బాల్‌ అనే సినిమాలో లీడ్‌ రోల్‌లో నటించింది. ఇక తెలుగులో 2008లో కొత్త బంగారం లోకం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఒక్కసారిగా మెస్మరైజ్‌ చేసింది అందాల తార. స్వప్న అనే పాత్రలో క్యూట్‌ యాక్టింగ్‌, చబ్బీ లుక్స్‌తో మెస్మరైజ్‌ చేసింది. కాలేజీ కుర్రకారును తన డైలాగ్స్‌తో కట్టి పడేసింది. ఇదిలా ఉంటే అనంతరం పలు చిత్రాల్లో నటించే అవకాశం దక్కించుకున్న ఆశించిన స్థాయిలో విజయాలను మాత్రం అందుకోలేకపోయింది. కొత్త బంగారులోకం సినిమా తర్వాత ఈ భామకు గ్యాప్ లేకుండా తెలుగులో చాలా మంచి అవకాశాలు వచ్చాయి. కాస్కో, కలవర్ కింగ్, ప్రియుడు అనే ఇలా కొన్ని డిఫరెంట్ లవ్ స్టోరీలు చేసినప్పటికీ అవి ఏమీ అంతగా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేకపోయాయి.

have you seen shwetha basu prasad how she changed now

స‌క్సెస్ లేక‌పోయిన కూడా ఈ అమ్మ‌డికి ఆఫ‌ర్స్ బాగానే వ‌చ్చాయి. సక్సెస్ అవుతున్నా లేకపోయినా కూడా 2017 వరకు కూడా ఈ బ్యూటీ హిందీ బెంగాలీ తమిళ్ తెలుగు భాషల్లో వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చింది. కానీ మధ్యలో ఆమె కొన్ని చేదు అనుభవాలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాగే తన బాయ్ ఫ్రెండ్ తో కూడా ఆమె బ్రేకప్ చెప్పింది. ఆ ప్రేమ వ్యవహారాల వలన ఆమె కొన్నాళ్లు డిప్రెషన్ లోకి కూడా వెళ్లినట్లు ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. పుట్టిన రోజు వేడుకల్లో కనిపించిన శ్వేత బసు ప్రసాద్‌అందరినీ షాక్‌కి గురి చేసింది. శ్వేతను చూసిన నెటిజన్లు ఆమెను గుర్తుపట్టలేకపోతున్నారు. ఒకప్పుడు చబ్బీగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు మరీ సన్నగా మారిపోయింది. దీంతో నెటిజన్లు అప్పటి ఆ అందంద ఏమైంది స్నప్న అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

Admin

Recent Posts