ముందుగా మనం పత్రికల్లో, మీడియా లో హీరో, హీరోయిన్ల కి కోట్లకి కోట్లు అలా ఇచ్చేస్తారన్న మాట నిజం కాదు.. సినిమా కి హైప్ ఇవ్వడం కోసం, హీరో కి ఇన్ని కోట్లు ఇచ్చేసాము, సినిమా బడ్జెట్ ఇన్ని 100 ల కోట్లు, అని ప్రచారం చేసుకుంటారు.. ఇదంతా ఒక రకమైన మార్కెటింగ్.. నిజానికి హీరోలు అందుకునే పారితోషకానికి , మీడియా లో హైప్ ఇచ్చే పారితోషకానికి ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా ఉంటుంది అంటారు..సరే ఇప్పుడు హీరోలకి పారితోషకం ఎలా ఇస్తారనేది చూద్దాము.. ఎన్టీఆర్ , ఏఎన్నార్ హీరోలుగా ఉన్న రోజుల్లో , వారు అగ్ర స్టూడియో లలో కాంట్రాక్టు ఉండేది.. అంటే నెల జీతానికి పని చేసేవారుట .. ఒక ఉద్యోగి మాదిరి, నెలకి ఇంతని జీతం.. కాబట్టి ఒక ఉద్యోగికి, తన యజమాని జీతం ఎలా ఇస్తారో, వారికి అలాగే ఇచ్చేవారు.. voucher , cheque లతో చెల్లింపు చేసేవారు.
తర్వాత ర్వాత వారికి ఆ కాంట్రాక్టు ముగిసి , వారు స్వతంత్రంగా బయట బ్యానెర్లలో సినిమాలు చేయడం మొదలుపెట్టాకా , ముందుగా కొంత నగదు అడ్వాన్సు తీసుకుని, మిగతా మొత్తం సినిమా షూటింగ్ ముగిసే లోపే నగదు రూపంలోనే తీసుకునేవారు అని ఒక సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ఈమధ్యన ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు.. వారు నటన నుంచి రిటైర్ అయ్యాక, చాలా కాలం నగదు రూపంలోనే చెల్లింపులు జరిగేవి అంటారు.. తర్వాతర్వాత సినిమాల్లో బ్లాక్ మనీ కూడా ప్రవేశించింది, ఇప్పుడు మన రియల్ ఎస్టేట్ లో జరుగుతున్నట్లు, బ్లాక్ ఇంత, వైట్ ఇంత అని చెల్లింపులు జరిపేవారు.. అయితే అందరు నిర్మాతలు అలా అని కాదు..
కొంతమంది నిర్మాతలు నగదు కి బదులుగా ఖరీదైన స్థలాలు , విల్లాలు, కార్లు బహుమతి మాదిరిగా ఇచ్చేవారు/ ఇస్తున్నారు..90 లలో చిరంజీవికి మాములు క్రేజ్ ఉండేది కాదు, అప్పట్లో అయన నైజాం ప్రాంత పంపిణి హక్కులు కూడా తీసుకునేవారు అని చెప్పుకునే వారు.. ఉదాహరణకి అప్పట్లో అయన పారితోషకం 1 కోటి అనుకుంటే, రూ . 70 లక్షలు నగదు, మిగతాది నైజాం హక్కులుగా తీసుకునేవారుట.. (ఒక ఉదాహరణకి మాత్రమే చెప్పాం , సరైన అంకెలు తెలియదు).. ఇక ప్రస్తుతం gst పన్ను విధానం నడుస్తుంది.. హీరో కి ఎంత పారితోషకమైనా ఇచ్చుకోండి, మాకు మాత్రం 30% పన్ను కట్టండి అంటుంది ఆదాయపు పన్ను శాఖ , కాబట్టి హీరో, హీరోయిన్ల కి ఇచ్చే పారితోషకంలో 30% TDS మినహాయించి చెల్లింపు చేస్తారు.. GST విధానంలో నగదు ప్రసక్తే ఉండదు కాబట్టి , ప్రస్తుతం బ్యాంకు ఖాతాకు నేరుగా బదిలీ చేయడం కానీ, లక్షల్లో మాత్రమే చెల్లింపులుంటే చెక్ ద్వారా మాత్రమే పారితోషకం చెల్లిస్తారు అనుకోవచ్చు..
ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, సినిమా షూటింగ్ పూర్తయ్యేలోపు హీరో, ఇంకా ఇతర సాంకేతిక నిపుణులు, నటుల పారితోషకాలు నిర్మాత పూర్తిగా చెల్లించాలి , అలా తమకు పారితోషకం దక్కిందని హీరో నిరభ్యంతర లేఖ ఇస్తేనే సినిమా విడుదల అవుతుంది.. కొంతమంది మంచి మనసుతో నిర్మాత దగ్గర డబ్బు లేదు అని తెలిస్తే, పారితోషకం పూర్తిగా వదిలేసుకోవడమో, లేదంటే సినిమా విడుదలై హిట్ అయ్యాక తీసుకోవడంలో చేస్తున్నారు కూడా..