Jr NTR Home : ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. తన తాత ఎన్టీఆర్ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తారక్ నందమూరి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్నాడు. ఎన్టీఆర్ కి ట్రిపుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ దక్కింది. ఇప్పుడు దేవర 2 అనే సినిమా చేస్తుండగా, ఇది కూడా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అవుతుంది. ఈ సినిమాతో ఎన్టీఆర్ క్రేజ్ మరింత పెరగనుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్‌కు సింప్లిసిటీ అంటే ఇష్టం, ఆయనకి పర్యావరణం మరియు పచ్చదనం పట్ల ఉన్న ఆసక్తి ఇల్లు చూస్తే తెలిసిపోతుంది. ఎన్టీఆర్ అప్పుడప్పుడు తన ఇల్లు ఫొటోలని ఇన్‌స్టాలో షేర్ చేస్తుండడంతో అవి వైరల్ అవుతూ ఉంటాయి.
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో జూనియర్ ఎన్టీఆర్‌కు మనోహరమైన మరియు సొగసైన ఇల్లు ఉంది. దీని అంచనా విలువ రూ. 25 కోట్లు. అదనంగా, జూనియర్ ఎన్టీఆర్‌కు హైదరాబాద్, బెంగళూరు మరియు కర్ణాటక నగరాల్లో ఇతర అద్భుతమైన ఆస్తులు ఉన్నాయి. రామ్ చరణ్, చిరంజీవి.. ఇంటికి దగ్గరలోనే ఉంటాడు ఎన్టీఆర్. ఈ ఇంటికి సంబంధించిన ఇంటీరియర్ చాలా అందంగా డిజైన్ చేయబడింది. వాల్ పెయింట్ కు సరిపడే ఫర్నిచర్ వారి టేస్ట్ కి అద్ధం పడుతుంది. ఇంటి ఆవరణలో ఉన్న ఊయలలో పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తారు ప్రణతి, ఎన్టీఆర్.
నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఈ ఇల్లు నిర్మించబడిందని అంటున్నారు. జూనియర్ ఇంటిని, ఇంటీరియర్‌ని చూస్తే ప్యూజులు ఎగిరిపోవల్సిందే అంటున్నారు. 2011 సంవత్సరంలో లక్ష్మీ ప్రణితిని వివాహం చేసుకున్న ఎన్టీఆర్ కి అభయ్ రామ్, భార్గవ్ రామ్ అని ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఎన్టీఆర్ గొప్ప నటుడే కాదు.. మంచి భర్త, మంచి తండ్రి కూడా. వారి ఫ్యామిలీ ఫోటోలు చూస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్ అని అనిపిస్తుంది. ఈయన ఎంత ఎదిగిన కూడా ఒదిగే ఉంటారు. ఒక్క చిత్రానికి దాదాపు 18 నుంచి 20 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటారని సమాచారం.