Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈయన అతి తక్కువ సమయంలోనే అశేష ప్రేక్షకాదరణ పొందాడు. చిరంజీవి సోదరుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ తర్వత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం, ఆయన నడవడికని చాలా మంది ఇష్టపడుతుంటారు. పవన్‌కి సామాన్యులే కాకుండా సెలబ్రిటీలు కూడా ఫ్యాన్స్‌గా ఉన్నారు. వారు పవన్‌తో పాటు ఆయన సినిమాలని ఎంతగానో ఇష్టపడుతుంటారు. అయితే ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ అందుకున్న ఎన్టీఆర్‌కి పవన్ నటించిన తొలి ప్రేమ సినిమా చాలా ఇష్టమట.. ఆ మధ్య ఓ షోలో ఎన్టీఆర్ ఈ విషయం చెప్పారు.
తొలి ప్రేమ చిత్రాన్ని కరుణాకరణ్ తెరకెక్కించగా, ఈ చిత్రం 1998లో విడుదలైంది. ప్యూర్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తి రెడ్డి హీరోయిన్‌గా నటించింది. అసలు ఈ సినిమా అప్పట్లో ఓ సెన్సేషన్ క్రియేట్ చేయడమే కాకుండా ఎంతో మంది మనసులని గెలుచుకుంది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ మనసు కూడా గెలుచుకుంది.
ఇక ఎన్‌టీఆర్ ఇటీవలే దేవర సినిమాతో మన ముందుకుగా రాగా త్వరలోనే దీనికి రెండో పార్ట్‌ను కూడా తెరకెక్కించనున్నారు. మరోవైపు డిప్యూటీ సీఎంగా పవన్ అటు రాజకీయాల్లో రాణిస్తూనే మరోవైపు సినిమాలు చేస్తున్నారు. ఈయన నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం త్వరలోనే విడుదల కానున్నట్టు తెలుస్తోంది.