Kavya Maran Net Worth : త‌్వరలోనే ఐపీఎల్ 2025 జరగనుంది. గత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం చాలా స్ట్రాంగ్‌గా కనిపించింది. హైదరాబాద్ ఆడే ప్రతి మ్యాచ్ లో ఒక్కరు హైలెట్ గా నిలుస్తున్నారు. ప్రతి కెమెరా కన్ను ఆమె పై ననే ఉంటాయి. టీవీ ల్లో మ్యాచ్ చూసే ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడెప్పడు ఆమె కనిపిస్తుందా అని కళ్ల ల్లో ఒత్తులు వేసుకుని మరి చూస్తారు. ప్రత్యేకంగా ఆమె కోసమే క్రికిట్ మ్యాచ్ చూసే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ వికెట్ పడిపోయినా, సిక్స్ కొట్టినా.. ఫోర్ కొట్టినా వీటితో మంచి ప్రదర్శన చేసినప్పుడ ల్లా ఆమె ఇచ్చే హవాభావాలు ప్రతి ఒక్కరిని ఎంతగానో కట్టిపడేస్తుంటాయి.
మ్యాచ్ ఓడినప్పుడు న్యూస్ వాళ్లు ఆటగాళ్ల ఫోటోలకు బదులు ఇమె పెట్టిన బుంగ మూతి ఫోటో లనే చూపిస్తారు. కనీసం ఆవిడ కోసమన్న సన్ రైజర్స్ గెలవాలని కూడా సోషల్ మీడియాలో మీమ్స్ వస్తు ఉంటాయి. ఇంతకీ ఇంతలా కుర్ర కారు గుండెల్లో ఉన్న ఆమె ఎవరంటే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య మారన్.కావ్య మారన్ వ్యక్తిగత జీవితం పూర్తిగా గోప్యంగా ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా ఆమె ఉండరు. ఆమె రిలేషన్‌షిప్ స్టేటస్‌పై ఎలాంటి అప్‌డేట్ లేదు. సన్ టీవీ గ్రూప్ ఛైర్మన్, వ్యవస్థాపకుడు కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్. డీఎంకే పార్టీ మాజీ కేంద్ర మంత్రి మురసోలి మారన్ మనవరాలు. 2018లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓగా కావ్య నియమితులయ్యారు. అప్పుడే క్రికెట్‌తో తన ప్రయణాన్ని మొదలుపెట్టారు.
కావ్య పేరు మీద ఎన్నో ఫ్యాన్ పేజీలు కూడా ఉన్నాయి. కేవలం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మాత్రమే కాకుండా.. పలు వ్యాపారాల్లో కూడా రాణిస్తున్న కావ్య.. బాగానే ఆస్తులు కూడబెట్టారు. ఆమె ఆస్తుల నికర విలువ దాదాపు 50 మిలియన్ల డాలర్లు ఉండొచ్చని పలు నివేదికలు చెబుతున్నాయి. కావ్య మారన్ తమిళనాడులో 1992లో జన్మించారు. చెన్నైలోని స్టెల్లా మోరిస్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. అనంతరం ఫారెన్‌లో మాస్టర్స్ చేశారు.సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీకి కో ఓనర్‌గా వ్యవహరిస్తున్న కావ్య.. సన్ మ్యూజిక్, సన్ టీవీ ఎఫ్‌ఎం ఛానళ్ల వ్యవహారాలను కూడా చూస్తున్నారు.