వినోదం

కృష్ణ వదిలేసిన ఈ సినిమా.. చిరంజీవికి లైఫ్ ఇచ్చింది!

ఇండస్ట్రీలో చిరంజీవి చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. ఎన్నో కష్టాలను ఎదుర్కొని తన సొంత టాలెంట్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు చిరంజీవి. అంతేకాదు ఇండస్ట్రీలోకి రావాలనుకున్న ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. అయితే ప్రస్తుతం మెగా హీరోలు రీమేక్ సినిమాలు ఎక్కువగా చేస్తున్నారు.

1985 లో పీటర్ వేర్ దర్శకత్వంలో హరిసన్ పోర్టు హీరోగా వెట్ నెస్ అనే సినిమా వచ్చింది. ఈ సినిమాను మన దేశానికి తగినట్టు మార్పులు చేసి ముమ్ముట్టి, నదియా జంటగా పూవిన్ పూతియా ఫూన్ సినిమాను తీసుకొచ్చారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో తెలుగులో హీరోలు కాస్త గట్టిగానే ప్రయత్నం చేశారు. అల్లు అరవింద్ ఈ సినిమా హక్కులు కొన్నారు.

krishna dropped from that movie so chiranjeevi can do it

ఈ విషయం తెలియక, విజయ బాపినీడు అదే కథతో మరో లైన్ రాసుకున్నారు. ఆచంట గోపీనాథ్ నిర్మాతగా శ్రీదేవి, కృష్ణ జంటగా సినిమా రావాల్సి ఉంది. మహేష్ బాబు బాల నటుడిగా చేయాల్సి ఉంది. అయితే షూటింగ్ స్టార్ట్ అవుతుందని భావించిన కొన్ని రోజులకు, చిరంజీవి హీరోగా కోదండరామిరెడ్డి, దర్శకత్వంలో వస్తుందని తెలియడంతో కృష్ణ డ్రాప్ అయ్యారు. ఈ సినిమానే పసివాడి ప్రాణం అన్నమాట.

Admin

Recent Posts