వినోదం

యాంకర్ ఉదయభాను గుర్తుందా.. తన భర్త, పిల్లలు ఎలా ఉన్నారో చూడండి..?

ఒకప్పుడు తెలుగు బుల్లితెరపై తన గ్లామర్ తో ఎంతోమందిని మైమరపించిన యాంకర్ ఎవరైనా ఉన్నారు అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఉదయభాను. ఒకప్పుడు సుమ‌, ఝాన్సీ లతో కలిసి పోటీ పడిన ఉదయభాను గ్లామర్ పరంగా చూస్తే ఒక మెట్టు పైగానే ఉండేది. ఉదయభాను పుట్టిన స్థలం కరీంనగర్ లోని సుల్తానాబాద్. తన తండ్రి షేక్ పాటిల్ డాక్టర్. కన్నతల్లి అరుణ కూడా ఆయుర్వేద డాక్టర్ తన తండ్రి కవి కూడా.. ఉదయభానుకు నాలుగు సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఆయన మరణించాడు. ఇక ఉదయభాను వెండితెరపై ఆర్.నారాయణమూర్తి నటించినటువంటి ఎర్రసైన్యం ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సమయంలో ఉదయభాను పదవ తరగతి చదువుతోంది.

ఆ తర్వాత దాసరి కొండవీటి సింహాసనం, ఖైదీ బ్రదర్స్, శ్రావణమాసం, లీడర్, జులాయి, ఆపదమొక్కులవాడు, పోలీస్ నెంబర్ వన్, మధుమతి వంటి మూవీస్ లో చిన్న చిన్న పాత్రలో నటించి మెప్పించింది. ఇక ఆమె తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో బాధలు పడింది. తన తల్లి ఆమెకు ఇష్టం లేకుండానే 15వ యేట ఒక వ్యక్తితో వివాహం చేసింది. ఆమె తల్లి మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. ఉదయభాను సంపాదించిన డబ్బుతో ఆమె భర్త జల్సాలు చేయడం ప్రారంభించారు. పగలంతా షూటింగ్ తో చాలా బిజీగా గడిపే ఉదయభాను, ఇంటికి వస్తే క్షణం ఒక యుగంలా గడిపేది. తన భర్త చేత నరకాన్ని అనుభవించి, పోలీస్ స్టేషన్ కు వెళ్లి విడాకులు తీసుకుంది.

have you seen anchor udaya bhanu and her kids

ఆమె వద్ద ఉన్న డబ్బంతా తన భర్త ఖర్చుచేశారు, చివరికి తన చేతిలో ఏమీ లేక,తోడు లేక అల్లాడి పోయింది. అయితే ఉదయభాను కు డ్యాన్స్ బేబీ డ్యాన్స్, హృదయాంజలి వంటి ప్రోగ్రామ్స్ మంచి పేరును తెచ్చి పెట్టాయి. తర్వాత ఆమె విజయ్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని ఇద్దరు కవల ఆడ పిల్లలకు జన్మనిచ్చింది. విజయ్ నుంచి తనకు కావలసినంత ప్రేమను పొందుతున్నానని, తన భర్త తనను నమ్ముతారని అది నా అదృష్టం అని చెబుతోంది. ఆమె భర్తది విజయవాడ, ఆయనకు పలు సినిమా థియేటర్లు ఉన్నాయి. చాలా సంపన్నుడు. అయితే ఉదయభాను సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం సక్సెస్ ఫుల్ గా సాగడం లేదు. చివరికి ఆమె కెరీర్ ఇంటికే పరిమితం అవుతుందో లేదంటే మళ్లీ ముందుకు వెళ్తుందో వేచి చూడాలి.

Admin

Recent Posts