Allu Arjun : అల్లు అర్జున్ చేసిన ప‌నికి విచారం వ్య‌క్తం చేస్తున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్‌..!

Allu Arjun : ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన చిత్రం.. ఆర్ఆర్ఆర్‌. శుక్ర‌వారం ఈ సినిమా థియేట‌ర్ల‌లో ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజయం సాధించి రికార్డుల వేట కొన‌సాగిస్తోంది. ఇప్ప‌టికే బాహుబ‌లి రికార్డును ఈ మూవీ బ్రేక్ చేసింది. దీంతో రానున్న రోజుల్లో మ‌రిన్ని రికార్డులు బ‌ద్ద‌లు కావ‌డం ఖాయ‌మ‌ని అంచ‌నా వేస్తున్నారు.

Pawan Kalyan fans unhappy with Allu Arjun
Allu Arjun

ఇక ఆర్ఆర్ఆర్ సినిమాను ఇప్ప‌టికే అనేక మంది సెల‌బ్రిటీలు చూసి చాలా బాగా తీశార‌ని అభినందించారు. ఇందులో రామ్ చ‌ర‌ణ్, ఎన్‌టీఆర్‌ల న‌ట‌న బాగుంద‌ని అంటున్నారు. అలాగే రాజ‌మౌళిని సైతం ప్ర‌శంసిస్తున్నారు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమా బాగుంద‌ని ట్వీట్ చేశారు. అయితే అంతా బాగానే ఉంది కానీ.. అల్లు అర్జున్ చేసిన ట్వీట్ ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు న‌చ్చ‌డం లేదు. ఎందుకంటే..

ప‌వ‌న్ క‌ల్యాణ్ తాజా చిత్రం భీమ్లా నాయ‌క్ ఫిబ్ర‌వ‌రి 25వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మార్చి 24 నుంచి ఆహా, హాట్ స్టార్‌ల‌లో స్ట్రీమ్ అవుతోంది. అయితే భీమ్లా నాయ‌క్ సినిమాను అల్లు అర్జున్ థియేటర్‌లోనే చూశాడు. కానీ సినిమా బాగుంద‌నో, బాగాలేద‌నో ఒక్క‌మాట కూడా చెప్ప‌లేదు. చివ‌రికి ఓటీటీలోకి ఈ మూవీ వ‌చ్చాక‌.. అప్పుడు బాగుంద‌ని చెప్పాడు. కానీ ఆర్ఆర్ఆర్‌కు మాత్రం విడుద‌లైన ఒక రోజుకే బాగుంద‌ని చెప్పాడు. దీంతో అల్లు అర్జున్‌పై ప‌వ‌న్ ఫ్యాన్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

భీమ్లా నాయ‌క్‌కు అయితే విడుద‌లైన‌ప్పుడు బాగుంద‌ని అన‌లేదు కానీ.. ఆర్ఆర్ఆర్ కు మాత్రం సినిమా బాగుంద‌ని అల్లు అర్జున్ చెప్ప‌డం.. ప‌వ‌న్ ఫ్యాన్స్‌ను విచారానికి గురి చేస్తోంది. అల్లు అర్జున్ ఇలా ఎందుకు చేశాడ‌ని ఫ్యాన్స్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌శ్నిస్తున్నారు. ఇక గతంలో పలు మార్లు సినిమా ఫంక్ష‌న్ల‌లో సైతం అల్లు అర్జున్ పాల్గొన్న‌ప్పుడు ప‌వ‌న్ గురించి చెప్ప‌మ‌ని ఆయ‌న ఫ్యాన్స్ గోల చేశారు. దీంతో అల్లు అర్జున్ చెప్ప‌ను బ్ర‌ద‌ర్ అని కామెంట్స్ చేశాడు. ఈ కామెంట్స్ కూడా అప్ప‌ట్లో వైర‌ల్ అయ్యాయి. ఇక ఇప్పుడు తాజాగా మ‌ళ్లీ ఈ వివాదం రాజుకుంది. చివ‌ర‌కు ఏమ‌వుతుందో చూడాలి.

Share
Editor

Recent Posts