వినోదం

పవన్ కు అన్ని కోట్ల ఆస్తులు, ఇండియాలోనే ఇదో రికార్డు… ఆమె వల్లే సినిమాల్లోకి!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన సినిమాల ద్వారా ఆయన ట్రెండ్ సెట్ చేస్తుంటారు. అయితే నిజానికి పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి టెక్నీషియన్ అవుదామని వచ్చారు. కానీ హీరోగా సక్సెస్ అయ్యారు. పవన్ కళ్యాణ్ కొణిదెల వెంకటరావు, అంజన దేవీలకు 1971 సెప్టెంబర్ 2న బాపట్లలో జన్మించారు. ఇతనికి ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నయ్యలు. తండ్రి కానిస్టేబుల్ కావడంతో ఆయన ఉద్యోగం చేస్తే పవన్ అక్కడ చదువుకోవాల్సి వచ్చింది. అందుకే ఆయన చదువు ఒక దగ్గర సాగలేదు. 10 వరకు ఎన్నో స్కూళ్లు మారిన పవన్, ఇంటర్ మాత్రం నెల్లూరులో చదివాడు.

వదిన వల్లే సినిమాల్లోకి వచ్చాడు. పెద్ద చదువులు చేయడం ఇష్టంలేని పవన్ కళ్యాణ్, ఆ తర్వాత ఏం చేయాలి అని ఆలోచిస్తున్న సమయంలో పుస్తకాలు చదవడం, ఒంటరిగా ఉండడం చేసేవాడు. ఇది గమనించిన వదిన సురేఖ, చిరంజీవితో పవన్ గురించి మాట్లాడారట. ఆయనను ఎలాగైనా సినిమాల్లోకి తీసుకెళ్లమని సూచించారట. పవన్ ను కూడా ఆమె బలవంతంగా ఒప్పించి హీరోను చేశారట.

pawan kalyan net worth properties and assets value

పవన్ కళ్యాణ్ కు దాదాపు రూ.120 కోట్ల ఆస్తులు ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అలాగే దాదాపు 100 కోట్ల విలువన్న ప్రాపర్టీలు కూడా ఉన్నాయట. అలాగే కార్లు, ఇల్లు మిగతా యాక్ససిరీస్ ల విలువ 50-100 కోట్లు ఉంటుందట. అంతేకాదు, పవన్ ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.40-50 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి.

తన సినీ కెరీర్ లో పవన్ కళ్యాణ్ ఎన్నో అవార్డులు, రివార్డులు, ఘనతలను సొంతం చేసుకున్నాడు. హీరోగా అతను స్టామినాను ఎప్పుడో నిరూపించుకున్న అతడు, తన సినీ ప్రయాణంలో ఎన్నో రకాల ప్రయోగాలు చేశాడు. ఇక ఇండియాలోనే ఏ స్టార్ చేయని విధంగా సింగర్ గా, స్టంట్ కొరియోగ్రాఫర్ గా, డాన్స్ మాస్టర్ గా, డైరెక్టర్ గా, స్క్రీన్ ప్లే రైటర్ గా, నిర్మాతగాను వ్యవహరించాడు.

Admin

Recent Posts