వినోదం

పవన్ కళ్యాణ్ రేణు కంటే ముందు ఫస్ట్ లవ్ లో పడింది ఆ హీరోయిన్ తోనేనా..?

సినిమాలైన రాజకీయమైనా పవన్ దిగనంతవరకే అనే విధంగా తయారయింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్.. పవన్ సినీ రాజకీయ జీవితంలో ఎంతో పేరు సంపాదిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఆయన వ్యక్తిగత జీవితంలో మాత్రం అనేక ఒడిదుడుకులు ఉన్నాయి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్ హీరో కాకముందు నందిని అనే వైజాగ్ అమ్మాయిని వివాహం చేసుకున్నారు. స్టార్ డమ్ వచ్చిన తర్వాత పవన్ తో నందినికి విభేదాలు రావడంతో విడిపోయారు. దీని తర్వాత బద్రి సినిమా చేసే సమయంలో హీరోయిన్ రేణు తో ప్రేమలో పడ్డారు.

pawan kalyan reportedly in love with amisha patel before renu desai

ఆమెతో లివింగ్ రిలేషన్షిప్ చేసి 2009లో ఆమెను రెండో వివాహం చేసుకున్నారు. తర్వాత వీరిద్దరూ విడిపోయారు. తర్వాత రష్యన్ గ‌ర్ల్‌ అన్నా లెజనోవా ను పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఆమెతోనే తన దాంపత్య జీవితాన్ని గడుపుతున్నారు. అయితే బద్రి సినిమాలో జరిగినటువంటి నిజాన్ని బయటపెట్టారు సీనియర్ దర్శకుడు గీతాకృష్ణ.. రేణు దేశాయ్ ఒక మోడల్.. ఈమెను దర్శకుడు గీతాకృష్ణ సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయాలనుకున్నాడు.కానీ గీతాకృష్ణ సినిమా ఆలస్యం కావడంతో ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన జేమ్స్ బాండ్ సినిమాతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. గీత కృష్ణ సినిమా ఆగిపోయింది.

ఈ క్రమంలోనే బద్రి సినిమా లో రేణు దేశాయ్ సెకండ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. షూటింగ్ సమయంలోనే పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడటం అందరికీ తెలిసిందే. అయితే నిజానికి రేణుదేశాయ్ కంటే ముందు పవన్ అమీషా పటేల్ ని ప్రేమించాడనే సంచలన నిజాలు బయట పెట్టాడు గీతా కృష్ణ. ఆ టైంలో అమీషా పటేల్ కూడా పవన్ క్రేజ్ చూసి పడిపోయిందట. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఆనాడు వీరిద్దరి వివాహం చేసుకుంటారని టాలీవుడ్లో టాక్ కూడా నడిచిందని అన్నారు. కట్ చేస్తే చివరికి రేణుదేశాయ్ తో ప్రేమలో పడి వివాహం కూడా చేసుకున్నారు.

Admin

Recent Posts