ప్రముఖ నటితో మాజీ ముఖ్యమంత్రి ప్రేమ వ్యవహారం కర్ణాటక రాజకీయాల్లో తుఫాను సృష్టించింది. మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి, నటి రాధికల రహస్య ప్రేమ వ్యవహారం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఇద్దరూ ఎవరినీ పట్టించుకోలేదు. 36 ఏళ్ల నటి తన కుటుంబానికి వ్యతిరేకంగా వెళ్లి అప్పటికే వివాహమైన వ్యక్తిని పెళ్లి చేసుకుంది.. ఆమె అతనికంటే 27 ఏళ్లు చిన్నది.. కానీ నేడు కోట్లకు యజమాని అయ్యింది. రాధికా కుమారస్వామి అంటే మీకు తెలియకపోవచ్చు కానీ.. కన్నడ చిత్రసీమలో ఆమెను తెలియని వారు ఉండరు. సినీ జీవితం కంటే మాజీ సీఎంతో ఆమెకు ఉన్న అనుబంధం కారణంగా వార్తల్లో నిలిచింది. 2006లో కర్ణాటక రాజకీయ నాయకుడు హెచ్‌డి కుమారస్వామిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.
కుమారస్వామితో ఆమె అనుబంధం గురించి సినీ పరిశ్రమ నుంచి రాజకీయ వర్గాల వరకు చర్చలు సాగాయి. దీంతో ఆమె సినీ జీవితం నాశనమైంది.. మరోవైపు జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి ఏడీ కుమారస్వామి రాజకీయాల కంటే ఆయన వ్యక్తిగత జీవితంపైనే ప్రజలు అధికంగా ఆసక్తి చూపడం ప్రారంభించారు. పెళ్లి నాటికి రాధిక కుమారస్వామి కంటే దాదాపు 27 ఏళ్లు చిన్నది. మీడియా కథనాల ప్రకారం వీరిద్దరికీ ఇది రెండో పెళ్లి. హెచ్‌డి కుమారస్వామి మొదటి వివాహం అనితతో 1986లో కాగా, రాధిక మొదటి వివాహం 2000 సంవత్సరంలో జరిగింది. కానీ ఎక్కువ కాలం కొనసాగలేదు. మరోవైపు రాధిక తండ్రి మాజీ ముఖ్యమంత్రితో తన కుమార్తె వివాహాన్ని వ్యతిరేకించారు. కానీ పెద్దలను ఎదురించి రాధిక కుమారస్వామిని రహస్యంగా వివాహం చేసుకుంది. రాధిక నిర్ణయం నాడు కర్ణాటకలో పెను సంచలనం సృష్టించింది.
రాధిక దాదాపు 30 సినిమాల్లో నటించింది. కానీ రాజకీయ నాయకుడితో ఆమె అనుబంధం తర్వాత.. యాక్టర్ గా తన సినీ జీవితం నాశనమైంది. అనంతరం నిర్మాతగా మారి లక్కీ అనే సినిమాను నిర్మించింది. రాధిక తన 14వ ఏట ‘నేనగాగి’ సినిమాతో తన నట జీవితాన్ని ప్రారంభించింది. ఆ సమయంలో ఆమె 9వ తరగతి చదువుతోంది. 2002లో విడుదలైన ‘నీల మేఘ శమ’ చిత్రం ద్వారా ఆమె సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం రాధిక సినిమా నిర్మాతగా మంచి పేరు తెచ్చుకుంది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రిని పెళ్లాడి కోటీశ్వరురాలైంది. పలు నివేదికల ప్రకారం ఆమె ఆస్తి విలువ.. రూ.124 కోట్లు, ఆమె భర్త కుమారస్వామి ఆస్తి విలువ రూ.440 కోట్లు ఉంటుందని సమాచారం.