వినోదం

సినిమాల్లో విల‌న్‌గా న‌టించిన రామిరెడ్డి.. అంత‌కు ముందు ఏం చేసేవారో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">సినిమాల్లో విలన్ అంటే పెద్ద బొట్టు&comma; ఎరుపెక్కిన కళ్లు&comma; బాడీ లాంగ్వేజ్ ఇలా ఎన్నో ఫీచర్లు ఉండేవి&period; అలా ప్రేక్షకుల్ని భయపెట్టే విలన్స్ లో రామిరెడ్డి పేరు బాగా పాపులర్ అయ్యింది&period; ఒక్క సినిమాలో విలన్ కు క్రేజ్ వచ్చిందంటే వరుస అవకాశాలు అందుకునేవారు&period; అలా రామిరెడ్డి ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాయన&period; ముఖ్యంగా ఆయన నటించిన పెద్దరికం&comma; అనగనగా ఒకరోజు&comma; రాములమ్మ&comma; అమ్మోరు లాంటి సినిమాల్లో ఆయన విలనిజం ఓ రేంజ్ లో ఉంటుందని చెప్పొచ్చు&period; విలన్ పాత్రలో ఆయన పర్ఫార్మెన్స్ కు ఆడియన్స్ ఎంతలా తిట్టుకున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు&period; తెలుగోడు&comma; జగద్గురు శ్రీ షిరిడి సాయిబాబా&comma; వీడు మనవాడే లాంటి సినిమాలతో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఏదైనా సినిమా సక్సెస్ ఫుల్ ఈవెంట్స్ లో రామిరెడ్డి కనిపించినా ఆడియన్స్ భయపడేవారని టాక్ కూడా ఉంది&period; అలాంటి నటుడిగా ఎంతో పేరు తెచ్చుకున్న రామిరెడ్డి 55 ఏళ్ల వయస్సులో మరణించారు&period; లివర్ కు సంబంధించిన వ్యాధితో 2011 లో తుది శ్వాస విడిచారు&period; నిజానికి ఈ వ్యాధికి గురైనప్పటి నుండి రామిరెడ్డి నరకం చూశారు&period; ఆయన శరీరం గుర్తుపట్టలేనంత సన్నగా అయిపోయింది&period; ఎంతోకాలంగా అనారోగ్యానికి గురయ్యారు&period; రామిరెడ్డి చిత్తూరు జిల్లాలో ఓబులంవారి పల్లెలో జన్మించారు&period; కాని చదువు అంతా హైదరాబాద్ లోనే సాగింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-67425 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;rami-reddy&period;jpg" alt&equals;"rami reddy interesting facts to know " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కెరీర్ స్టార్టింగ్ లో రామిరెడ్డి ఓ ఉర్దూ పత్రికలో జర్నలిస్ట్ గా వర్క్ చేశారు&period; ఆ తర్వాత ఆయనకు సినిమాలపై ఇంట్రెస్ట్ కలిగి ప్రొడ్యూసర్ల చుట్టూ తిరిగారు&period; సహా నటుడిగా ఎదగాలని మొదట ప్రయత్నాలు చేసిన రామిరెడ్డి ఆహార్యం చూసిన డైరెక్టర్లు ఆయన విలన్ పాత్రలకు సరిగ్గా సరిపోతారని సెలెక్ట్ చేశారట&period; అలా మొదటి సినిమాతోనే విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు&period; ఆ తర్వాత నుండి ఎన్నో సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించి మెప్పించారు&period; రామిరెడ్డికి ఇద్దరు కుమారులు&comma; ఒక కుమార్తె ఉన్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts