వినోదం

సినిమాల్లోకి రాక‌ముందు రామ్ చ‌రణ్ ఎలా ఉన్నాడో చూశారా..?

సినీ ఇండస్ట్రీలో తమ ఫేవరెట్ స్టార్ కు సంబంధించి ఏదైనా కొత్త విషయం తెలిసిందంటే ఆ ఆనందమే వేరు. ముఖ్యంగా సెలెబ్రిటీల ప్రొఫెషనల్ లైఫ్ కంటే పర్సనల్ లైఫ్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. అలాంటి ఓ వీడియోనే ప్రజంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి ఈ వీడియోకు అభిమానులు తెగ ఫిదా అవుతున్నారు. ఆ వీడియో ఎవరిదో అనుకుంటున్నారా.. స్టార్ హీరో అయిన రామ్ చరణ్, హీరోయిన్ శ్రియా శరన్ లది. సినీ ఇండస్ట్రీలో రామ్ చరణ్ కు ప్రజంట్ ఫుల్ క్రేజ్ ఉంది.

ఆర్ఆర్ఆర్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారారు. నటనపై ఎంతో ఇంప్రూవ్ అయిన రామ్ చరణ్ రంగస్థలం, ఆర్ఆర్ఆర్ సినిమాలతో ఎంతోమంది కామెంట్స్ కి చెక్ పెట్టాడు. ముఖ్యంగా రంగస్థలంలో రామ్ చరణ్ యాక్టింగ్ పీక్స్. అప్పటివరకు ఉన్న రామ్ చరణ్ వేరు ఈ సినిమాతో వేరు అనిపించుకున్నారు. విమర్శల ప్రశంసలు కూడా అందుకున్నారు. ఇక రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ తో మరో మెట్టు ఎదిగారు.

do you know how ram charan is before movies

ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా అవార్డ్స్ లో ట్రూ లెజెండ్ అనే అవార్డ్ ను అందుకుని వైరల్ అయ్యారు. రీసెంట్ గా రామ్ చరణ్, శ్రియ శరణ్ యాక్టింగ్ వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో స్కిల్స్ డెవలప్ చేసుకున్న విజువల్స్ చూడొచ్చు. ఈ ప్రాక్టీస్ లో థీమ్ అయితే తెలియదు గానీ, వీడియోలో గొప్ప యాక్టర్ అయినా, ఏ రంగంలోనైనా గొప్ప స్థాయికి వెళ్లాలంటే వర్క్ లో ప్రాక్టీస్, బెటర్ మెంట్ అవసరమనేలా ఈ వీడియో ఉంది. వీళ్లు యాక్టర్స్ గా ప్రజంట్ స్టార్ డమ్ తో వెలుగుతున్నారు.

Admin

Recent Posts