Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

సావిత్రి చివరి రోజులు.. ఎంత దుర్భరమో..!

Admin by Admin
March 4, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఆమె కళ్లు వెండితెరపై వెలుగులు చిమ్మాయి. ఆమె చిరునవ్వు చిత్రసీమలో వెన్నెల పూయించింది. ఆమె హొయలు నెమలి కుళ్లుకునేలా చేసింది. ఆమె మాట ఓ వీణలా మార్మోగింది. తెలుగుదనానికి నిండైన రూపం. అసమాన నటనకు నిదర్శనం. తారలెందరొచ్చినా మహానటి సావిత్రిని మైమరపించడం సాధ్యం కాని పని. వెండితెరపై ఓ వెలుగు వెలిగిన సావిత్రి తన చివరి రోజుల్లో ఎలా బతికిందో కొందరికే తెలుసు. మహానటి సినిమాలో చూసింది కూడా కొంతే.

సీనియర్ నటి తులసి.. సావిత్రి గురించి ఎన్నో విషయాలను పంచుకున్నారు. సావిత్రితో మా అమ్మగారికి మంచి స్నేహం ఉండేది. ఆమె సూచన వల్లే నేను సినిమాలకి పరిచయం అయ్యాను. చివరి రోజుల్లో సావిత్రి చిన్న ఇంట్లో ఉండటం నిజమే. ఆ ఇంటి రోడ్డుకి ఇవతల మా ఇల్లు ఉండేది. సావిత్రి చివరి రోజుల్లో పడిన కష్టాలను చూస్తే.. ఈ కళ్లే వద్దు అని అనిపించింది.. అని చెప్పింది తులసి.

savitri faced many problems in her last days

అంతేకాదు.. మరికొన్ని విషయాలను కూడా పంచుకుంది. ‘సావిత్రి చనిపోయినప్పుడు ఆ ప్రాంతంలోని రోడ్లన్నీ జనంతో నిండిపోయాయి. ఒక మనిషి చనిపోతే ఇంతమంది వస్తారా? అనే ఆశ్చర్యం అప్పట్లో అందరిలో ఉండేది. సావిత్రి ఎన్నో దానాలు చేశారు. ఆమెకి అలాంటి పరిస్థితి రావడం ఏంటి? అని అంతా అనుకుంటారు. కానీ, ఆమె దగ్గర నటించి దానాన్ని పొందినవారే ఎక్కువ.. అని ఆనాటి విషయాలను వివరించింది.

సావిత్రిని చూసిన చాలామంది తమ జీవితంలో డబ్బు విషయంలో జాగ్రత్త పడ్డారని… చివరి రోజులను దృష్టిలో పెట్టుకుంటూ ముందుకు వెళ్లారని చెప్పింది తులసి. అలా కూడా ఆ తల్లి అందరికీ మంచే చేసిందని.. ఆమె జీవితం ఓ పుస్త‌కం. ఆమె నుంచి నేను అందుకున్న ఆశీస్సుల ముందు ఏ అవార్డులు పనికి రావు.. అని తెలిపింది.

Tags: savitri
Previous Post

లవ్ సింబల్ గా ఈ గుర్తు ( ♥ ) నే ఎందుకు వాడతారు?

Next Post

ఉదయ్ కిరణ్ హిట్స్ మరియు ఫ్లాప్ సినిమాల లిస్ట్ ఇదే..!!

Related Posts

వినోదం

ఎన్టీఆర్ కి ఇష్టమైన వంటకం ఏదో తెలుసా..?

June 14, 2025
వినోదం

మహేష్ కు తెలుగు రాయడం, చదవడం రాదా…?

June 14, 2025
వినోదం

మెగా ఫామిలీ మీద కామెంట్స్ చేసి సినిమా అవకాశాలు కోల్పోయిన వారు వీరేనా ?

June 14, 2025
హెల్త్ టిప్స్

వ్యాయామం చేస్తున్నారా.. అయితే గుండె ఆరోగ్యానికి ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి..

June 14, 2025
వ్యాయామం

ముఖంలో ఉండే కొవ్వు క‌రిగి అందంగా, నాజూగ్గా క‌నిపించాలంటే.. ఈ చిన్న‌పాటి వ్యాయామాలు చేయండి..

June 14, 2025
వైద్య విజ్ఞానం

రోజూ ఒక పూట మాత్ర‌మే సంతృప్తిక‌రంగా భోజ‌నం చేయండి.. ఎందుకంటే..?

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!