Akkamma Jakkamma : తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కి ప్రపంచవ్యాప్తంగా ఎంత గుర్తింపు ఉందో వేరే చెప్పనవసరం లేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి సూపర్ స్టార్ స్థాయికి ఎదిగారు రజినీకాంత్. ఆయన నటన, స్టైల్, వే ఆఫ్ డైలాగ్ డెలివరీ చూసే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. తమిళ భాషలోనే కాదు టాలీవుడ్ లో కూడా ఆయనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. రజినీకాంత్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలలో శివాజీ చిత్రం కూడా ఒకటి. శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్, శ్రియ శరన్ కలిసి నటించిన చిత్రం శివాజీ.
ఈ చిత్రంలో పక్కా తెలుగు సంప్రదాయాలు కలిగిన అమ్మాయిలా శ్రియ శరన్ కనిపించింది. ఆమెను మొదటి చూపులోనే ఇష్టపడిన శివాజీ (రజనీకాంత్) పరిచయం పెంచుకోవడం కోసం దీపావళి పండుగ సందర్భంగా శ్రియ ఇంటికి వెళ్తారు. శ్రియ కుటుంబ సభ్యులు వారితో పరిచయం పెంచుకోవడం ఇష్టంలేదని నో చెప్పి వెంటనే బయటకు పంపించేస్తారు. శ్రియ ఇంటి ఎదురింటి వ్యక్తి దీపావళి సంబరాలు జరుపుకుంటూ వారిని చూస్తాడు. మా ఇంటికి రండి.. నాకు అక్కమ్మ, జక్కమ్మ అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు ,మాతో పరిచయం పెంచుకోండి అంటూ వాళ్ళను ఇంటికి ఆహ్వానిస్తాడు.
శివాజీ చిత్రంలో అక్కమ్మ, జక్కమ్మ ఇద్దరూ డీ గ్లామరస్ పాత్రలో ఫన్ క్రియేట్ చేస్తూ నటించి అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నారు. ఫస్ట్ హాఫ్ లో మూడు నాలుగు సార్లు కనిపించిన ఈ ఇద్దరూ అమ్మాయిలు అప్పట్లో చాలా ఫేమస్ అయ్యారు. కానీ తిరిగి తర్వాత ఏ చిత్రంలోనూ కనిపించలేదు. ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు కూడా వీరు బయట కూడా ఈ విధంగానే ఉంటారని భావించారు.
నిజానికి అక్కమ్మ, జక్కమ్మ పాత్రలలో నటించిన ఇద్దరమ్మాయిలు బయట చూడడానికి ఎంతో ముచ్చటగా అందంగా ఉంటారు. వీరిద్దరి అసలు పేర్లు అంగవై, సంఘవై. వీరి లేటెస్ట్ ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫోటోలను చూసిన నెటిజన్లు సైతం అక్కమ్మ, జక్కమ్మ చూడడానికి ఇంత అందంగా ఉంటారా అని ఆశ్చర్యపోతూ కామెంట్స్ చేస్తున్నారు.