టాలీవుడ్ ప్రేక్షకులకు శ్వేత బసు ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె బాలనటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తరువాత తెలుగులో కొత్త బంగారు లోకం మూవీతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే సక్సెస్‌ను అందుకుంది. కానీ ఆమెకు లక్ కలసి రాలేదు. దీంతో తరువాత చేసిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఆమె చేసిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవడంతో ఇతర భాషల మూవీల్లోనూ యాక్ట్ చేసింది. కానీ అక్కడా నిరాశ తప్పలేదు. దీంతో సినిమా ఇండస్ట్రీ నుంచి తప్పుకుంది.
అయితే ఇండస్ట్రీ నుంచి తప్పుకున్న ఈమె పలు కారణాల వల్ల వార్తల్లో నిలిచింది. కానీ కొన్నేళ్లు గ్యాప్ తీసుకుని మళ్లీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఈమధ్యకాలంలో ఈ అమ్మడు పలు టీవీ షోలు, సిరీస్‌లు, ఓటీటీ మూవీలు చేస్తూ మళ్లీ బిజీగానే మారింది. కానీ అందాల డోసును పెంచింది. దీంతో ఆమె గ్లామర్ ఫొటోలు ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా రెడ్ కలర్ టాప్, బ్లూ జీన్స్‌తో తన సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఈమె దర్శనమిచ్చింది. ఈ డ్రెస్‌లో ఆమె కుర్రాళ్ల మతులను పోగొడుతోంది.
శ్వేత బసు ప్రసాద్ నటించిన ఊప్స్ అబ్ క్యా ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ షో ప్రచార కార్యక్రమంలో ఆమె పాల్గొని సందడి చేస్తోంది. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఈ అమ్మడు సందడి చేస్తోంది. తన లేటెస్ట్ ఫొటోలను అందులో అప్‌లోడ్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. ఇక ఓటీటీ పుణ్యమా అని రీ ఎంట్రీ ఇస్తున్న ఈమె ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.