technology

ముకేష్ అంబానీని వ‌ణికించేలా BSNL ప్లాన్.. బెస్ట్ బ‌డ్జెట్ ప్లాన్ ఇదే..!

ఇప్పుడు నెట్‌వ‌ర్క్స్ మ‌ధ్య కాంపీటీష‌న్ పెర‌గుతూ ఉంది. బీఎస్‌ఎన్‌ఎల్ రీఎంట్రీతో జియో, ఎయిర్‌టెల్‌, వీఐ టెన్షన్‌లో ఉన్నాయి. బీఎస్‌ఎన్‌ఎల్ చందాదారులు నిరంతరం పెరుగుతూనే ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా కొత్త యూజర్లను చేర్చుకుంటూ వస్తోన్న జియో ఈసారి మాత్రం తన కస్టమర్లను భారీగా కోల్పోవాల్సి వచ్చింది. ఈ క్రమంతో ప్రభుత్వ కంపెనీ బీఎస్‌ఎన్‌ఎల్ స‌రికొత్త ప్లాన్స్‌తో ఆక‌ర్షిస్తుంది. ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ తన 4జీ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తోంది. కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త ప్లాన్‌లను పరిచయం చేస్తోంది. ఇటీవలే తక్కువ ధరకు ఎక్కువ వ్యాలిడిటీతో ప్లాన్​ను పరిచయం చేయగా తాజాగా తన కస్టమర్లకు అదిరే ఆఫర్​ను తీసుకొచ్చింది.

బీఎస్ఎన్ఎల్ ఇప్పుడు చౌకైన రూ.779 వార్షిక ప్లాన్‌ను అందిస్తోంది. ముఖ్యంగా, ఇది ఏ ఇతర కంపెనీతో పోల్చినా ఒక సంవత్సరం చెల్లుబాటుతో చౌకైన ప్లాన్. 779 పాన్‌లో, బీఎస్ఎన్ఎల్ ఏ నెట్‌వర్క్‌కైనా 365 రోజుల పాటు అపరిమిత కాలింగ్‌ను అందిస్తుంది. వినియోగదారులు రోజుకు కేవలం రూ.5తో అనేక ప్రయోజనాలను కూడా పొందవచ్చు. రీఛార్జ్ ప్యాకేజీ నో-కాస్ట్ కాలింగ్ మరియు ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రారంభ రెండు నెలలకు 2GB రోజువారీ డేటా కోటాతో పాటు రోజుకు వంద ఎస్ఎంఎస్‌ లను అందిస్తుంది.

bsnl launched its best plan to compete with jio

బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్ల కోసం రెండు కొత్త వార్షిక ప్లాన్‌లను ప్రారంభించింది. మొదటి ప్లాన్ ధర రూ.1999 మరియు సంవత్సరానికి 600GB డేటాను అందిస్తుంది. రెండవ ప్లాన్ ధర రూ.2399 మరియు పూర్తి సంవత్సరానికి ప్రతిరోజూ 2GB డేటాను అందిస్తుంది. రెండు ప్లాన్‌లలో మొదటి నెల ఉచిత బీఎస్ఎన్‌ల‌ ట్యూన్‌ల బోనస్ కూడా ఉన్నాయి. ఈ కొత్త ప్లాన్‌లు బీఎస్ఎన్ఎల్‌ వినియోగదారుల కోసం డేటా ఆఫర్‌లను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ప్రస్తుతం చౌకైన ప్లాన్‌లకు పెట్టింది పేరుగా బీఎస్ఎన్ఎల్‌ మారింది. కానీ, బీఎస్‌ఎన్‌ఎల్ 4G సేవలు మాత్రం భారతదేశం అంతటా చేరుకోలేదు. 2025 నాటికి 4G నెట్‌వర్క్ భారతదేశం అంతటా విస్తరిస్తుందని ప్రభుత్వం తెలిపింది.

Sam

Recent Posts