వినోదం

ఎన్టీఆర్ పార్టీకి తెలుగు దేశం అని పెట్టడం వెనుక ఎస్వీ రంగారావు సలహా ఏంటంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీనీ ఓ లెవెల్ లో నిలబెట్టిన నటుల్లో ఎస్ వి రంగారావుకు ప్రత్యేకమైన పేరు ఉంది. ఈయన ఇండస్ట్రీలోకి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఎస్. వి.రంగారావు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నటుడు. ఆయన తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో ప్రఖ్యాతులు సంపాదించినప్పటికీ ఎక్కువ సినిమాలు చేసింది మాత్రం తమిళ ఇండస్ట్రీ లోనే. అయితే అప్పట్లో ఎస్.వి.రంగారావు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా సపోర్ట్ చేసేవారట.

ఏమైనా రాజకీయ చర్చలు వచ్చినప్పుడు కాంగ్రెస్ ను సమర్థిస్తూ ఎక్కువగా మాట్లాడేవారు. అయితే ఎస్.వి.రంగారావు కు ఎక్కువగా ఎన్టీఆర్ తో చర్చలు జరిగినప్పుడు చాలావరకు రాజకీయాల గురించి మాట్లాడే వారట. ఆ సమయంలో ఎక్కువగా ఎన్టీఆర్ దృష్టి సినిమాలపైనే ఉండేదట. అప్పట్లో ఎస్.వి.రంగారావు ను కాపీ కొట్టి ఆయనలాగా నటించడానికి ప్రయత్నం చేసే వారట ఎన్టీఆర్. ఇక దీన్ని చూసిన రంగారావు కాంగ్రెస్ ను చూసి కాపీ కొట్టినట్టు ఉంటుంది అంటూ రాజకీయ పరిభాషలో చమత్కరించారట.

sv ranga rao is the reason for sr ntr political entry

అంటే కాంగ్రెస్ పెద్ద పార్టీ అని మిగతా పార్టీలు ఆ పార్టీ ని చూసి నేర్చుకోవాలి అనే అర్థంతో ఆయన కామెంట్ చేశారు. అంటే నీ అంతట నువ్వే ఎదిగే ప్రయత్నం చేయమని రామారావుకు సలహా ఇచ్చారట. ఆయన సలహా ఎన్టీఆర్ మైండ్లో ఫిక్స్ అయిపోయింది. అదే ఆలోచనతో రామారావు రాజకీయాల్లోకి వచ్చే సమయంలో కాంగ్రెస్ పార్టీ నీ కాపీ కొట్టకుండా టిడిపి పార్టీ ని స్థాపించి రాజకీయాల్లోకి వచ్చారనేది అసలు నిజం.

Admin

Recent Posts