పెళ్లి అనేది ఎన్నో ఏళ్ల బంధం. ఒక్కసారి ముడి పడితే.. నిండు నూరేళ్లు కలిసి ఉండాలి. అయితే..ఈ వివాహాలు చేసుకునే సమయంలో.. చాలా మంది ప్రేమ వివాహలు చేసుకుంటున్నారు. ఏజ్, కులం అనే తేడా లేకుండా వివాహాలు చేసుకుంటున్నారు. ఇందులో క్రికెటర్లు కూడా ఉన్నారు. ముఖ్యంగా తమ కంటే వయసులో పెద్ద వారిని పెళ్లి చేసుకున్న టీమిండియా క్రికెటర్లు కూడా ఉన్నారు. అలాగే… క్రికెటర్లను పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్లు కూడా ఉన్నారు. వారేవరో ఇప్పుడు చూద్దాం.
అనుష్క శర్మ-విరాట్ కోహ్లీ.. నాలుగేళ్ల ప్రేమాయణం తర్వాత 2017 డిసెంబర్ 11 న పెళ్లి చేసుకున్నారు విరుష్క జోడి. హార్దిక్ పాండ్యా-నటాషా స్టాన్కోవిక్.. పాండ్యా వల్లనే లైమ్ లైట్ టైము దక్కించుకుంది నటాషా. వీరి బంధం పెళ్లి వరకు వెళ్లకపోయినా నిశ్చితార్థం ముగించుకొని ఒక మగ బిడ్డకు జన్మనిచ్చారు. కానీ ఇప్పుడు విడిపోయారు. సంగీత-అజారుద్దీన్.. 1980 మిస్ ఇండియా అయిన సంగీత బిజిలాని తో చాలా కాలం డేటింగ్ చేసిన అజారుద్దీన్ 1996లో పెళ్లి చేసుకున్నాడు. జహీర్ ఖాన్-సాగరిక.. బాలీవుడ్ నటి సాగరిక జహీర్ తో ప్రేమలో ఉండి సినిమాల్లో కనిపించింది. కానీ, ఆ తర్వాత తనకు తానే సినిమాల నుంచి తప్పుకుంది. జహీర్ కూడా టీవీల్లో రాణించేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు.
యువరాజ్-హేజల్ కీచ్.. సల్మాన్ ఖాన్ సినిమా బాడీగార్డ్ లో కనిపించిన హేజేల్ యువరాజ్ ను పెళ్లాడి సినిమాలకు దూరం అయింది. హర్భజన్-గీత బస్రా.. ఇమ్రాన్ హష్మీ సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన గీత, నాలుగు సినిమాలు మాత్రమే చేసింది. హర్భజన్ తో పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి మళ్లీ రాణించేందుకు ప్రయత్నించినా సక్సెస్ కాలేకపోయింది.