ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో రమ్యకృష్ణ ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఆమె వయసు పెరిగినా కానీ ఇప్పటికీ ఏమాత్రం తరగని అందంతో తనదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. ఆమె తెరపై కనిపిస్తే చాలు థియేటర్ మొత్తం గడగడ లాడాల్సిందే. ఆమె దేవతగా అవతారమెత్తిన, శివగామి గా మారిన, విలన్ క్యారెక్టర్ చేసిన, పోలీస్ డ్రెస్ వేసుకున్న ఏ పాత్రలోనైనా రమ్యకృష్ణ నటనా చాతుర్యము వేరు.. అంత టాలెంట్ ఉంది కాబట్టే ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో స్టార్ నటిగా పేరు తెచ్చుకుంది.ఇక పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయిన బాహుబలి సినిమాలో ఆమె నటన మాత్రం మరో లెవెల్ అని చెప్పవచ్చు. అయితే రమ్యకృష్ణ కెరీర్ ను మార్చిన సినిమాలు ఏంటో చూద్దాం.
# సూత్రధారులు.. 1989 లో కళాతపస్వి.కే విశ్వనాథ్ డైరెక్షన్ లో వచ్చిన ‘సూత్రధారులు’ తో నటిగా ఆమెకు మంచి మార్కులు పడ్డాయి. #అల్లుడుగారు.. రాఘవేంద్రరావు దర్శకత్వంలో 1990లో వచ్చిన “అల్లుడుగారు” సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంది. #నరసింహ.. రమ్యకృష్ణ కెరియర్ లో “నరసింహ” ప్రత్యేకంగా నిలిచిపోయింది. రజినీకాంత్ హీరోగా నటించిన ఈ చిత్రంలో నీలాంబరిగా చరిత్రలో నిలిచిపోయే పర్ఫార్మెన్స్ చేసింది. #అల్లరి మొగుడు.. “అల్లరి మొగుడు” సినిమా ఫ్యామిలీ రొమాంటిక్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో మోహన్ బాబు, మీనా, రమ్యకృష్ణ, సోమయాజులు జె వి, కైకాల సత్యనారాయణ, బ్రహ్మానందం, నగేష్ తదితరులు ముఖ్యపాత్రలలో నటించారు.
#హలో బ్రదర్.. “హలో బ్రదర్” సినిమా యాక్షన్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో నాగార్జున, రమ్యకృష్ణ, సౌందర్య, శ్రీహరి, బ్రహ్మానందం, ఆలీ, కోట శ్రీనివాసరావు, మల్లికార్జున రావు నటించారు. #ఘరానా బుల్లోడు.. “ఘరానా బుల్లోడు” సినిమా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో నాగార్జున, రమ్యకృష్ణ, ఆమని, నూతన్ ప్రసాద్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి నటించారు. #అమ్మోరు.. “అమ్మోరు” సినిమా హర్రర్ గ్రామ ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో సౌందర్య, రమ్యకృష్ణ, సురేష్ రామిరెడ్డి, బాబు మోహన్, కల్లు చిదంబరం, వై విజయ, గుండు హనుమంతరావు, వధివుకరసి నటించారు.
#సోగ్గాడి పెళ్ళాం.. “సోగ్గాడి పెళ్ళాం” సినిమా యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో మోహన్ బాబు, రమ్యకృష్ణ, మౌనిక బేడి, కైకాల సత్యనారాయణ, కస్తూరి, నిర్మలమ్మ, సంగీత నటించారు. #ఆహ్వానం.. ఆహ్వానం సినిమా రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో శ్రీకాంత్, రమ్యకృష్ణ, కైకాల సత్యనారాయణ, బ్రహ్మానందం, రాజగోపాల్ తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు. #బాహుబలి.. “బాహుబలి” లో శివగామి పాత్రతో ఇండియన్ ఇండస్ట్రీలో మరోసారి తన సత్తా చూపించారు.