వినోదం

అనౌన్స్‌ చేసి రిలీజ్ కాని… మ‌హేష్ బాబు సినిమాలు ఇవే !

ప్రిన్స్ మహేష్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సక్సెస్ హీరోగా మహేష్ బాబు కొనసాగుతున్నారు. మహేష్ బాబు చేసిన సినిమాల్లో దాదాపు 90 శాతం సినిమాలు హిట్ అయినవి. అయితే మహేష్ బాబు తెలుగు లో అనౌన్స్ చేసి మరీ.. రిలీజ్ కానీ సినిమాలు కూడా ఉన్నాయి. ఆ సినిమాలో ఇప్పుడు చూద్దాం.

మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో హరే రామ హరే కృష్ణ అనే సినిమాను ముందుగా ప్రకటించారు. దీనికి ఎం.ఎస్.రాజు నిర్మాతగా కూడా ఫిక్స్ అయ్యారు. అయితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల కుండా నే ఆగిపోయింది. అలాగే శివం అనే పేరుతో మహేష్ బాబు హీరోగా క్రిష్ దర్శకుడిగా అనౌన్స్ చేశారు. అంతేకాకుండా సోనాక్షి సిన్హా ను హీరోయిన్ గా కూడా ఫైనల్ చేశారు. అయితే ఈ సినిమా కూడా సెట్స్పైకి వెళ్లలేదు. అంతేకాదు మణిరత్నం, మహేష్ బాబు, విక్రమ్ కాంబినేషన్లో కూడా ఓ ప్రాజెక్టును ప్రకటించారు..

these mahesh babu movies stopped in the middle

కానీ అది కార్యరూపం దాల్చలేదు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై హేమేందర్ డైరెక్షన్ లో మిర్చి అనే సినిమాను ప్రకటించారు. అయితే ఇది కూడా కార్యరూపం దాల్చలేదు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మిస్టర్ ఫర్ఫెక్ట్ సినిమా కూడా ప్రకటించారు. ఇది కూడా సెట్స్పైకి వెళ్లలేదు. అటు మాస్ దర్శకుడు వినాయక్ తో కూడా ఒక మూవీ ప్రకటించారు. అది కూడా రాలేదు. అలాగే జనగణమన అని పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రకటించారు. ఆ సినిమాలో మహేష్ బాబు రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇలా చాలా సినిమాలు అనుకున్నప్పటికీ… మధ్యలోనే ఆగిపోయాయి.

Admin

Recent Posts