వినోదం

చూడటానికి బాగానే ఉన్నా బాక్సాఫీస్ డిజాస్టర్‌గా నిలిచిన 5 తెలుగు సినిమాలు ఇవే..!

1.నిర్ణయం.. స్టేక్ ఔట్ అనే ఆంగ్ల చిత్రం ఆధారంగా మలయాళంలో మోహ‌న్‌లాల్‌ హీరోగా ప్రియదర్సన్ దర్శకత్వంలో వందనం రిమేక్ గా ఈ నిర్ణయం సినిమా తెలుగు లో వచ్చింది. క్రైం డ్రామా గా తెరకెక్కిన ఈ సినిమాలో పాటలన్ని హిట్. ముఖ్యగా హెలోగురు ప్రేమకోసమేరా జీవితం పాట చాలా హిట్ . చిన్ని జయంత్, శుభలేఖసుధాకర్ కామెడీ చాలా బాగుంటుంది. అమల అమాయకమైన నటన, అండర్ కవర్ పోలీస్ గా నాగార్జున నటన , నిజాయితీ గల ప్రభుత్వఉద్యోగి, క్రిమినల్ గా మురళీమనోహర్ పాత్ర చాలా బాగుంటాయి. విలన్ గా శరత్ సక్సేన భ‌యపెడతాడు. సినిమా ఎక్కడా బోర్ కొట్టదు కానీ ఆశించిన ఫలితం రాలేదు.

2.డాడీ.. చిరంజీవి తనకు చిన్నపిల్లలు,T-షర్ట్స్ చాలా ఇష్టమని అప్పట్లో పలు వార్తాపత్రికల ముఖాముఖిలో చెప్పేవారు. ఆవకాశం వస్తే చిన్నపిల్లలు ఇష్టపడే ఓ సినిమా చేస్తానని చెప్పారు. అదే డాడీ. కుటుంబమంతా చక్కగా చూడదగ్గ సినిమా కానీ రిలీజ్ కరెక్ట్ టైం కి రాలేదు. ఈ సినిమాలో గుమ్మాడి గుమ్మాడి పాట చాలా పాపులర్ అయ్యింది. ఇప్పటికి కొంతమంది చిన్నపిల్లల తండ్రుల రింగ్‌టోన్ కూడా ఈ పాటే ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఓ ఫైట్ ని కంపోజ్ చేశారు. ఈ మూవీని చూస్తే బాగానే అనిపిస్తుంది, కానీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. 3. వాన.. సుమంత్ ఆర్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ఎంఎస్ రాజు స్వ‌యంగా నిర్మించి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా ఇది. క‌న్న‌డ‌లో తెర‌కెక్కిన ముంగారు మ‌లే అనే మూవీకి రీమేక్‌గా వాన‌ను తెర‌కెక్కించారు. సినిమా బాగానే ఉంటుంది కానీ హిట్ అవ‌లేదు.

these movies are good according to story but became flop

ప్ర‌భాస్‌, చార్మి, త్రిష హీరో హీరోయిన్లుగా వ‌చ్చిన పౌర్ణ‌మి క‌థ ప‌రంగా బాగానే ఉంటుంది. ఫ్యాక్ష‌న్‌, డ్యాన్స్ జోన‌ర్‌ల‌లో తెర‌కెక్కిన ఈ మూవీలో పాట‌లు అన్నీ బాగుంటాయి. కానీ సినిమా ఆక‌ట్టుకోలేక‌పోయింది. అలాగే న‌టుడు రాజ‌శేఖ‌ర్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన క‌ల్కి మూవీ ఆద్యంతం ఎక్క‌డా బోర్ కొట్ట‌దు. కానీ ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్‌గా నిలిచింది.

Admin

Recent Posts