వినోదం

Oosaravelli Movie : ఎన్‌టీఆర్ ఊస‌ర‌వెల్లి మూవీ ఫ్లాప్ అయింది అందుకేనా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Oosaravelli Movie &colon; జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి మూవీ 2011 అక్టోబర్ 6à°¨ రిలీజై యావరేజ్ గా నిలిచింది&period; అయితే ఈ మూవీ టీవీలో వస్తుంటే&period;&period; సినిమా బాగానే ఉంది కదా&period;&period; ఎందుకు తేడా కొట్టింది&period;&period; అనిపిస్తుంది&period; భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ తొలివారం భారీ ఓపెనింగ్స్ తెచ్చుకున్నా&period;&period; తర్వాత చతికిలబడి యావరేజ్ గా నిలిచింది&period; శక్తి మూవీ ఫ్లాప్ తర్వాత ఊసరవెల్లి మూవీ జూనియర్ ఎన్టీఆర్&comma; సురేంద్రరెడ్డి కాంబోలో వస్తుండడంతో తారక్ ఫాన్స్ కసితో ఉన్నారు&period; కానీ వాళ్ళ అంచనాలు తలకిందులు అయ్యాయి&period; నిజానికి కిక్ మూవీ తర్వాత సురేంద్రరెడ్డి తీస్తున్న మూవీ కావ‌డంతో తారక్ స్టైలిష్ నెస్&comma; ఆకట్టుకునే సాంగ్స్&comma; ట్రైలర్ అన్నీ చూశాక అంచనాలు బాగా పెరిగాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టోటల్ గా రూ&period;27&period;50 కోట్ల షేర్ కలెక్ట్ చేసి బిలో యావరేజ్ మూవీ అయింది&period; రూ&period;25 కోట్లతో తీసిన ఈ సినిమా రూ&period;10 కోట్ల టేబుల్ ప్రాఫిట్ తో రూ&period;35 కోట్లకు అమ్ముడైంది&period; అందులో 80 శాతం మాత్రమే రాబట్టింది&period; తారక్ నటన&comma; తమన్నా గ్లామర్&comma; జయప్రకాశ్ రెడ్డి గ్యాంగ్ హాస్యం&comma; దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్&comma; ఇక స్క్రీన్ ప్లే చెప్పక్కర్లేదు&period; రిపీట్ ఆడియన్స్ రావాలి&period; కానీ టైటిల్ ఊసరవెల్లి అని పెట్టడం&comma; మొదటి భాగంలో ఎన్టీఆర్ నటన హైలెట్ గా ఉన్నా&comma; సెకండాఫ్ లో ఎన్టీఆర్ కి సంబంధం లేకుండా హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ నడవడం&comma; తారక్ కనిపించకుండా ఆ ఎపిసోడ్ నడవడం మైనస్ అయింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56342 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;oosaravelli-movie&period;jpg" alt&equals;"this is the reason for jr ntr oosaravelli movie flop " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హీరోకి ఆశయం లేకుండా&period;&period; హీరోయిన్ ఆశయమే తన లక్ష్యంగా కథనం ఉండడం మైనస్ పాయింట్&period; పగ&comma; ప్రతీకారం ఒకరిదే అవ్వాలని పరుచూరి బ్రదర్స్ చెప్పారు&period; అప్పుడే హీరో ఎమోషన్స్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతాయి&period; పగ తీర్చుకోవడం&comma; హీరోయిన్ ని విలన్స్ నుంచి కాపాడ‌డం అనే కాన్సెప్ట్ అయితే సినిమా వేరే రేంజ్ లో ఉండేది&period; మొదటి భాగం వినోదంగా సాగి సెకండాఫ్ సీరియస్ లో నడవడం మరో మైనస్&period; అందుకే క్లైమాక్స్ లో ఏదో కోల్పోయామన్న భావన ఫ్యాన్స్ లో ఏర్పడింది&period; అప్పటి వరకూ తారక్ ని చూసిన తీరు వేరు&period; ఈ సినిమాలో తీరు వేరు&period; దీన్ని ఫాలో అవ్వడానికి ఫ్యాన్స్ కి సమయం పట్టింది&period; అందుకే టీవీల్లో చూశాక సూపర్ మూవీ అంటున్నారు&period; ఇక దూకుడు మూవీ రెండు వారాల ముందు వచ్చి మంచి దూకుడు మీద సాగిపోయింది&period; మిక్స్ డ్ టాక్ రావడంతో ఊసరవెల్లి దెబ్బతింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts