Vitamin D Tablets : ప్రతి మనిషి శరీర ఎదుగుదలకు విటమిన్ డి ముఖ్య పాత్ర పోషిస్తుంది. విటమిన్ డి అనేది మన శరీరానికి కాల్షియం సక్రమంగా అందేలా చేస్తుంది. శరీరానికి తగినంత విటమిన్ డి తీసుకోవడం వలన ఎముకలు మరియు దంతాల పెరుగుదలకు సహాయపడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో కూడా విటమిన్ డి అనేది కీలక పాత్ర పోషిస్తుంది. కేవలం ఆహారం ద్వారానే కాదు సూర్యరశ్మి ద్వారా కూడా మనకు కావలసినంత విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది.
కానీ ప్రస్తుత కాలంలో మారుతున్న పరిస్థితుల వల్ల విటమిన్ డి అనేది శరీరానికి సక్రమంగా అందడం లేదు. దీని కారణంగా ఎటువంటి డాక్టర్ సలహా లేకుండా అనేక మంది శరీరానికి విటమిన్ డి అందించడం కోసం టాబ్లెట్స్ రూపంలోఎక్కువగా తీసుకుంటున్నారు. టాబ్లెట్స్ రూపంలో తీసుకోవడం వలన విటమిన్ డి అనేది మన శరీరంలో ఎక్కువైతే ఎలాంటి దుష్ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
శరీరంలో విటమిన్ డి ఎక్కువైతే కాల్షియం స్థాయి కూడా పెరిగి ఆకలి తగ్గిపోవటం జరుగుతుంది. రక్తపోటు వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా శరీరంలో విటమిన్ డి ఎక్కువ అవ్వటం వలన ఎముకల మీద వ్యతిరేక ప్రభావం పడుతుంది. శరీరంలో విటమిన్ డి ఎక్కువైతే కిడ్నీ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది.
అంతేకాకుండా కిడ్నీ ఫెయిల్యూర్ వంటి సమస్యలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది. ఏ విధమైన వైద్యుని సలహా లేకుండా విటమిన్ డి టాబ్లెట్స్ వేసుకోకూడదు. విటమిన్ డి తీసుకుంటే రకరకాల వైరస్ మరియు బ్యాక్టీరియాల నుంచి రక్షణ పొందవచ్చు. కానీ మోతాదుకు మించి తీసుకోకూడదు. విటమిన్ డి వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తొందరగా కనిపించవు. కాబట్టి డాక్టర్ సలహా మేరకు మాత్రమే విటమిన్ డి టాబ్లెట్స్ వాడడం ఉత్తమం.