వినోదం

Venkatesh : ఆ హీరోయిన్ అంటే వెంక‌టేష్‌కి ఎందుకంత కోపం.. ఇప్ప‌టికీ ఆమెతో మాట్లాడ‌డ‌ట‌…?

Venkatesh : సీనియ‌ర్ ఎన్టీఆర్ వెంక‌టేష్ ఎప్పుడు ఎంతో స‌రదాగా, చలాకీగా ఉంటారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న ఇప్ప‌టికీ చాలా యాక్టివ్‌గా ఉత్సాహంగా ఉంటారు. అయితే వెంకీ ఇప్ప‌టికీ త‌న తోటి హీరోల‌తో సాన్నిహిత్యంగా ఉంటూ వైవిధ్య‌మైన సినిమాలు చేస్తున్నారు. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌తో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న‌ విక్టరీ వెంకటేష్. బడా ప్రొడ్యూసర్ కుమారుడిగా సినిమాల్లోకి వచ్చినా.. తక్కువ టైంలోనే తన టాలెంట్‌ను చూపించుకుని స్టార్ హీరోగా ఓ రేంజ్‌లో ఉన్నాడు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చే సినిమాలు చేస్తూ అల‌రిస్తున్నాడు.

వివాదాల‌కు వెంక‌టేష్ చాలా దూర‌మ‌నే విష‌యం మ‌నంద‌రికి తెలిసిందే. అయితే ఓ హీరోయిన్‌తో మాత్రం వైరం వ‌ల‌న ఇప్ప‌టికీ మాట్లాడ‌డం లేద‌ట‌. ఎంతో మంది హీరోయిన్లతో జత కట్టిన వెంకటేష్ ఒక్క హీరోయిన్ కు మాత్రం దూరంగా ఉంటున్న‌ట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆ హీరోయిన్ రాజకీయాల్లో చక్రం తిప్పుతుండ‌గా, అప్పట్లో ఆమె వెంకటేష్ క‌న్నా ఎక్కువ రెమ్యున‌రేష‌న్ తీసుకునేద‌ట‌. ఒక స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో ఈమెతో వెంకటేష్ కలిసి సినిమా చేద్దామనుకున్నారట.. కానీ కొన్ని కారణాల వల్ల ఆ కాంబినేషన్ వర్కౌట్ కాలేదు.. మళ్లీ అదే కథాంశంతో కొన్నేళ్ల తర్వాత మరో స్టార్ హీరోయిన్ ను పెట్టి సినిమా తీశారు.

venateksh and that actress were not talking from many years

స్టోరీ అంతా సేమ్ టు సేమ్ తనకు వినిపించిన స్టోరీ లాగే ఉందని, నన్ను కాదని మరో హీరోయిన్ ని పెట్టుకోవాల్సిన అవసరం ఏముందని ఆ హీరోయిన్‌ వెంకటేష్ పై కోపానికి వచ్చిందట. దీంతో వెంకటేష్ కూడా అంతే సీరియ‌స్‌గా స్పందించి అదంతా దర్శక నిర్మాతల నిర్ణయం అని అందులో నా ప్రమేయం ఏమీ లేదని చెప్పారట.. ఇక అప్పటి నుంచి వీరి మధ్య వార్ నడుస్తూనే ఉండ‌గా, ఈ రోజు వరకు వీరి మధ్య మాటలు లేవని సమాచారం. ఈ విషయం ఇండస్ట్రీలో చాలామందికి తెలిసిన ఎవ‌రు కూడా వారిని కలిపే ప్రయత్నం చేయలేదు.. అందుకు కార‌ణం ఆమె చాలా మొండిద‌ట‌. మ‌రి ఫ్యూచ‌ర్‌లో అయిన ఈ ఇద్ద‌రు క‌లుస్తారా అన్నది చూడాలి.

Admin

Recent Posts