హెల్త్ టిప్స్

Garlic : రోజూ ప‌ర‌గ‌డుపునే రెండు వెల్లుల్లి రెబ్బ‌ల‌ను తింటే.. ఇన్ని ప్ర‌యోజ‌నాలా..?

Garlic : ఉదయాన్నే పరగ‌డుపున ఒక వెల్లుల్లి రెబ్బను తింటుంటే శరీరంలో అనేక‌ మార్పులు చోటు చేసుకుంటాయి. ఉదయాన్నే వెల్లుల్లిని తినడం వ‌ల్ల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. మ‌రి ఆ ప్ర‌యోజ‌నాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా. వెల్లుల్లిలో అల్లిసిన్ ఉంటుంది. అందువ‌ల్ల వాటిని తింటే రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. హైబ్లడ్ ప్రెజర్ తో బాధపడే వారికి వెల్లుల్లి ఎఫెక్టివ్ గా ప‌నిచేస్తుంది. ఉదయాన్నే పరగ‌డుపున ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలను తీసుకోవడం వల్ల హైబీపీ త‌గ్గుతుంది.

వెల్లుల్లిని ఉదయం పరగ‌డుపున తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు త‌గ్గుతాయి. వెల్లుల్లి రెబ్బ‌ల‌ను తింటుంటే శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా నివారించ‌వ‌చ్చు. పచ్చి వెల్లుల్లి రెబ్బల‌ని ఉదయాన్నే పరగ‌డుపున తీసుకోవడం వల్ల వివిధ రకాల క్యాన్సర్లు వ‌చ్చే అవ‌కాశాల‌ను తగ్గించవచ్చు. వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని వ్యర్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతాయి. శ‌రీరం అంత‌ర్గ‌తంగా శుభ్రంగా మారుతుంది.

many wonderful health benefits of garlic

వెల్లుల్లిని పురుషులు కాల్చుకుని తిన‌డం వ‌ల్ల శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది. వీర్యం ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతుంది. దీంతో సంతానం క‌లిగే అవ‌కాశాలు మెరుగు ప‌డతాయి. వెల్లుల్లి రెబ్బ‌ల‌ను తిన‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరిగి సీజ‌న‌ల్ వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు. అయితే వెల్లుల్లి ఆరోగ్య‌క‌ర‌మే అయిన‌ప్ప‌టికీ గ్యాస్ స‌మ‌స్య‌, అసిడిటీ, క‌డుపులో అల్స‌ర్లు, శ‌రీరంలో వేడి ఉన్న‌వారు మాత్రం తిన‌రాదు. అలాగే పాలిచ్చే త‌ల్లులు, గ‌ర్భిణీలు డాక్ట‌ర్ సూచ‌న మేర‌కు వీటిని తిన‌వ‌చ్చు.

Admin

Recent Posts