వినోదం

Venkatesh : వెంకటేష్ ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా.. ఇంద్ర భవనాన్ని తలపించే ఇల్లు.. లెక్క కట్టలేని ఆస్తులు..!

Venkatesh : టాలీవుడ్ లో ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని సుదీర్ఘ కాలంగా సత్తా చాటుతున్నాడు విక్టరీ వెంకటేష్. దిగ్గజ నిర్మాత రామానాయుడు తనయుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన.. 1986లో కళియుగ పాండవులు అనే సినిమాతో టాలీవుడ్‌కు హీరోగా పరిచయం అయ్యాడు. అది సూపర్ డూపర్ హిట్ అవడంతో తక్కువ టైంలోనే తన టాలెంట్‌ను నిరూపించుకొని స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చే సినిమాలు చేస్తూ పక్కింటి అబ్బాయిలా మారిపోయాడు. విక్టరీ వెంకటేష్ సినిమాల్లో నటిస్తూనే మరొక వైపు సక్సెస్ఫుల్ వ్యాపారవేత్తగా కూడా తన సత్తా చాటుతున్నాడు.

ఇక సుమారుగా 35 సంవత్సరాలకు పైగా ఇండస్ట్రీలో ఉన్న ఆయన హైదరాబాదులో తన ఇంటిని చూస్తే మాత్రం మతిపోవాల్సిందే. ఇంద్ర భవనాన్ని తలపిస్తున్న ఆ ఇంటిలో వెంకటేష్ తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఇక వెంక‌టేష్ ఆస్తుల విష‌యానికి వ‌స్తే తండ్రి రామానాయుడు నుంచే వార‌స‌త్వంగా కోట్లాది రూపాయ‌లు సొంతం అయ్యాయి. అయితే తండ్రి నుంచి వ‌చ్చిన చ‌రాస్తుల విలువ లెక్క మాత్రం ఊహ‌కు అంద‌ని విధంగానే ఉంటుంద‌ని.. వాటి విలువ లెక్కించ‌లేం అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు చెపుతున్నాయి. రామ‌నాయుడు సంపాద‌న‌లో చాలా ఆస్తులు చెన్నైలోనూ, హైద‌రాబాద్‌లోనూ ఉన్నాయి.

venkatesh net worth and properties value

వాటి విలువ ఇప్పుడు కోట్ల‌లోనే ఉంటుంద‌ట‌. ఇక తన అన్నయ్య ప్రముఖ నిర్మాత సురేష్ బాబు సలహా మేరకు బిజినెస్ తో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా పెట్టుబడులు పెట్టి వెంకటేష్ బాగా దూసుకుపోతున్నారు అని చెప్పవచ్చు. మొత్తంగా రూ.2,300 కోట్ల దాకా ఆయన ఆస్తి ఉంటుందని సమాచారం. ఇక తండ్రి రామానాయుడు నుండి వారసత్వంగా ఆయన రూ.5000 వేల కోట్ల రూపాయల వరకు ఆస్తి లభించింది అని ట్రేడ్ వర్గాలు చెపుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే రూ.7, 300 కోట్ల రూపాయల ఆస్తికి వెంకటేష్ వారసుడు అని తెలుస్తోంది.

Admin

Recent Posts