వినోదం

Venkatesh Net Worth : విక్ట‌రీ వెంక‌టేష్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..? నోరెళ్ల‌బెడ‌తారు..!

Venkatesh Net Worth : సినిమా హీరో హీరోయిన్స్ కి సంబంధించిన ప్రతి అంశం వైరల్ అవుతూ ఉంటుంది. వాళ్ళు వాడే వస్తువుల‌ నుంచి నివసించే ఇంటి వరకూ ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తుంటాయి. తాజాగా విక్టరీ వెంకటేష్ ఇంటికి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. ఆ ఇంటి ఖరీదు రూ.కోట్లలో ఉంటుందని అంచనా. మూవీ మొఘల్ దివంగత దగ్గుబాటి రామానాయుడు భారతదేశంలోని అన్ని భాషల్లో చిత్రాలు తీయడమే కాకుండా 100 చిత్రాల‌కు మించి నిర్మించిన నిర్మాతగా గిన్నిస్ బుక్ రికార్డు క్రియేట్ చేశారు. ఆయన వారసుడిగా వెంకటేష్ కలియుగ పాండవులు మూవీతో టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ సినిమా తర్వాత విభిన్న పాత్రలతో క్లాస్ అండ్ మాస్ ఆడియన్స్ లో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్న వెంకటేష్ ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీ పడుతూ హిట్స్ అందుకుంటున్నాడు. ఇక రామానాయుడు పెద్ద కొడుకు డి.సురేష్ బాబు నిర్మాతగా కొనసాగుతున్నారు. అయితే తండ్రి వారసత్వంగా వెంకటేష్ కి స్థిర చరాస్తులు భారీగానే వచ్చాయని అంటున్నారు. మద్రాసు, హైదరాబాద్ లలో ఇళ్ళు ఇతడి వాటాగా వచ్చాయి.

venkatesh net worth and properties value

సురేష్ బాబు, వెంకటేష్ ఇంకా మద్రాసు, హైదరాబాద్ లలోని ఆస్తులను పంచుకోలేదట. అయినప్పటికీ వారసత్వ ఆస్తులతోపాటు హీరోగా కూడా సంపాదించడం వలన ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టినట్లు టాక్. మొత్తం మీద వెంకీ ఆస్తులు రూ.2,100 కోట్లకు పైమాటే అని అంటున్నారు. ఎందుకంటే ఏ వ్యాపారంలో అడుగుపెట్టినా అందులో సక్సెస్ అందుకుంటున్నాడని తెలుస్తోంది. క‌నుక వెంకీకి భారీగా ఆస్తులు ఉన్న‌ట్లు స‌మాచారం.

Admin

Recent Posts