ఇప్పటి తరం వారిని ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా పైకి వచ్చిన స్టార్ ఎవరు అని ప్రశ్నిస్తే మొదటిగా గుర్తుకు వచ్చేది చిరంజీవి. కానీ చిరంజీవి కెరీర్ ప్రారంభించిన రోజుల్లో సాధారణ నటుడుగా ఉన్న టైంలోనే అతనిని చూసి ఇతను ఎప్పటికైనా పెద్ద స్టార్ గా ఎదుగుతాడని గ్రహించిన అల్లు రామలింగయ్య చిరంజీవికి తన కూతురు సురేఖను ఇచ్చి వివాహం చేశారు. ఒక సాధారణ నటుడు ఆ తర్వాత కాలంలో మెగాస్టార్ గా ఎలా ఎదిగాడు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సినీ ఇండస్ట్రీలో మొదటిలో ఎక్కువగా చౌదరీలు ఉండేవారు. అప్పటికీ, ఇప్పటికీ, హీరోలు కానీ, డైరెక్టర్లు, నిర్మాతలు ఇలా చాలా మంది కమ్మ కులానికి సంబంధించిన వ్యక్తులే ఇండస్ట్రీని శాసించేవారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సమయంలో చిరంజీవి హీరోగా ఆ సమయంలో మంచి స్థాయికి ఎదుగుతున్నాడు. చిరంజీవి హీరోగా కెరియర్ స్టార్ట్ చేయకముందే బాలకృష్ణ అప్పటికే హీరోగా ఇండస్ట్రీలో పరిచయమయ్యాడు. ఆ సమయంలో చిరంజీవి తప్ప మిగతా క్యాస్ట్ వారందరూ కమ్మవారు ఎక్కువగా ఉండేవారు.
అప్పటికి చిరంజీవికి మెల్లమెల్లగా స్టార్ డమ్ వస్తోంది. పెద్దవాళ్ళతో జాగ్రత్తగా లేకపోతే ఎదగడం కష్టం. తెలిసో తెలియకో చిరు ఏదైనా పొరపాటు చేసినా, సినిమాలు హిట్ కొట్టిన తన కొడుకుని స్టార్ గా నిలపెట్టే క్రమంలో అధికారంలో ఉన్న ఎన్టీఆర్ చిరంజీవిని తొక్కేస్తాడెమో.. పైగా తమ కులం వాళ్ళు అప్పటికీ సినిమా ఇండస్ట్రీలో అంతగా నిలబడలేదు. కాబట్టి చిరుని జాగ్రత్తగా ఒక్కో మెట్టు ఎక్కించాలని నడుం బిగించారట అల్లు రామలింగయ్య. చిరంజీవిని పిలిచి ప్రతిరోజు ఉదయం నాలుగు గంటల కల్లా ఎన్టీఆర్ గారి ఇంటి బయట గేటు దగ్గర నిలబడి ఉండమని చెప్పారట అల్లు రామలింగయ్య. అప్పుడు 9999 వైట్ అంబాసిడర్ లో ఎన్టీఆర్ బయటికి వస్తారు. వెంటనే ఆయనకు ఓ నమస్కారం చేయి అని చెప్పారట.
ఇక మన కుర్రాడే పైకి వస్తాడనే ఆలోచన కలుగుతుంది అనేది అల్లు రామలింగయ్య ఆలోచన. చిరంజీవి కూడా మామగారు అల్లు రామలింగయ్య చెప్పిన విధంగానే చాలా కాలం పాటు ఎన్టీఆర్ కు రోజు గుడ్‌మార్నింగ్ చెప్పేవారట. ఒకసారి వరదలు వచ్చిన సమయంలో ఎన్టీఆర్ వరద ప్రాంతాలను సందర్శించడానికి వెళ్ళారు. ఆ సమయంలోనే చిరంజీవి జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా సక్సెస్ మీట్‌కు ఏర్పాటు చేయడం జరిగింది. అదే సమయంలో ఎన్టీఆర్ చిరంజీవి ఒకరికి ఒకరు ఎదురుపడ్డారట. ఆ సమయంలో చిత్ర బృందాన్ని కలిసి ఎన్టీఆర్ ఏం బ్రదర్ మీ సినిమా తుఫాన్ లో కూడా కలెక్షన్ల తుఫాన్ సృష్టిస్తుందని ప్రశంసించారట చిరంజీవిని.