వ్యాయామం

తొడల వ‌ద్ద కొవ్వు అధికంగా పేరుకుపోయిందా.. అయితే ఇలా చేయండి..

తొడల భాగంలో కొవ్వు చేరితే అవి లావెక్కి అసహ్యంగా వుంటాయి. యువతి యుక్తవయసుకు వచ్చిందంటే కటి ప్రదేశం పెరిగి తొడలలో కొవ్వు చేరే అవకాశాలుంటాయి. ఈ కొవ్వును కరిగించేటందుకు క్రీములు, మర్దనలు వున్నప్పటికి, ఒక చక్కని ఆహార ప్రణాళిక, వ్యాయామం సహజంగా తొడల భాగ కొవ్వును కరిగిస్తాయి. తొడభాగ కొవ్వు కరిగించే వ్యాయామాలు – పరుగు, జాగింగ్, స్విమ్మింగ్ వంటివి ఈ సమస్యకు బాగా పనిచేస్తాయి. సెల్యులైట్ అనే ఈ సమస్య శరీరంలో రక్త ప్రసరణ సరి లేకుంటే ఏర్పడుతుంది.

ప్రతి రోజూ పరుగు లేదా జాగింగ్ కనీసం 30 నుండి 45 నిమిషాలు ఖాళీ పొట్టతో చేయాలి. వెల్లకిలా పడుకోండి. మోకాళ్ళను వంచి వేరు చేయండి. చేతులు వెనక్కు తిన్నగా పెట్టి శరీర బరువు బ్యాలన్స్ చేయండి. రిలాక్స్ అవుతూ దీనినే 10 నుండి 15 సార్లు చేయండి. మోకాళ్ళు 90 డిగ్రీలకు తెచ్చి అరచేతులు తిన్నగా నేలకు ఆనించండి. ఇపుడు మోకాలు వంచే కుడి పాదం పైకి ఎత్తండి. కొద్ది సేపు అలానే వుంచి పది లెక్కించండి. రిలక్స్ అయి ఈ సారి ఎడమ పాదంతో చేయండి. ఈ వ్యాయామాన్ని 8 నుండి 10 సార్లు చేయాలి.

if you have fat at thighs follow these tips

తిన్నగా నించోండి. కాళ్ళు ఎడం చేయండి. ఇపుడు మోకాళ్ళు వంచి ఛైర్ పై కూర్చున్నట్లు కూర్చోండి. శరీర బరువు మడమలమీద వుండాలి. పది అంకెలు లెక్కించేవరకు వుండండి. తిన్నగా లేచి రిలాక్స్ అయి ఇదే విధంగా పది సార్లు చేయండి. తొడ కొవ్వు కరిగించి తొడలను అందంగా, ఆకర్షణీయంగా తయారు చేసేందుకు ఈ చిట్కాలు ఆచరిస్తే మీ శరీరం నాజూకుగా వుంటుంది.

Admin

Recent Posts