వినోదం

చిరంజీవి స్థాయిలో ఉండాల్సిన సుమన్.. ఎందుకలా అయ్యారు..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అంటే చిరంజీవి&comma; బాలకృష్ణ &comma;వెంకటేష్&comma; నాగార్జున&comma; మోహన్ బాబు పేర్లే ప్రధానంగా వినిపిస్తాయి&period; అయితే ఈ పేర్లతో పాటుగా ఆ తరం హీరోల్లో ఒకరిగా ఉండాల్సిన ఈ హీరో సినీ జీవితం మధ్యలోనే డిస్ట్రబ్ అయింది&period;&period; మరి ఆ హీరో ఎవరు&period;&period; అలా కావడానికి కారణం ఏంటో చూద్దాం&period;&period; ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో విలన్ గా&comma; క్యారెక్టర్ చేస్తున్న నటుడు సుమన్&period;&period; అలనాడు సూపర్ స్టార్ గా ఎదిగారు&period; ఆయన సినిమా థియేటర్ లోకి వచ్చింది అంటే జనాలు ఎగబడి మరీ చూసేవారు&period;&period; అలా స్టార్ హీరోగా ఎదుగుతున్న సమయంలోనే అతని జీవితంలోకి అనుకొని ఒక సంఘటన తీవ్రంగా కుంగదీసింది&period;&period; చిరంజీవి స్థాయిలో ఉండాల్సిన సుమన్ ను కిందకు దిగజార్చింది&period;&period; తమిళ ఇండస్ట్రీలో మొదటగా సక్సెస్ అయిన సుమన్ హీరోగా తెలుగు ఇండస్ట్రీలో 1982 ఎంట్రీ ఇచ్చి కేవలం రెండు సంవత్సరాల్లోనే సూపర్ స్టార్ పేరు తెచ్చుకున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫైట్స్ లో కొత్త ట్రెండ్ సృష్టించి యాక్షన్ మూవీ ఇష్టపడేవారికి అభిమాన హీరో అయ్యాడు&period; ఆయనకు లేడీస్ లో కూడా ప్రత్యేకమైన స్థానం ఉండేది&period; అప్పటికే చిరంజీవి ఖైదీ సినిమాతో స్టార్ హీరోగా ఎదిగారు&period; దీంతో చిరంజీవి&comma; సుమన్ మధ్య సినిమాల్లో పోటీ ఏర్పడింది&period; ఇద్దరు యువ హీరోలు అవ్వడం అన్ని విభాగాల్లో అదరగొట్టడం వల్ల వీరి మధ్య విపరీతమైన పోటీ ఏర్పడింది&period; వీరి మధ్యలో బాలకృష్ణ రావడంతో ముగ్గురు టాలీవుడ్ ను ఏలేస్తారని అందరూ భావించారు&period; ఇక సుమన్ రెమ్యూనరేషన్ ఐదు లక్షలు నడుస్తోంది&period; అప్పటికి ఎన్టీఆర్&comma; ఏఎన్నార్&comma; కృష్ణ&comma;శోభన్ బాబు శ్రీదేవి లు మాత్రమే అంతా పారితోషకం తీసుకుంటున్నారు&period; అలాంటి సమయంలో సుమన్ డేట్స్ కోసం నిర్మాతలు ఎదురుచూస్తున్నారు&period; ఈ సమయంలోనే సుమన్ జీవితంలో ఒక విపత్కర పరిణామం చోటు చేసుకుంది&period; కొంతమంది కుట్ర పన్ని సుమన్‌ను గూండాగిరి&comma; మరో కేసులో ఇరికించారు&period; కనీసం బెయిల్ కూడా రాకుండా నాలుగు నెలల పాటు సుమన్ దుర్భర జీవితాన్ని గడిపారు&period; ఆ సమయంలో ఆయనకు నలుగురైదుగురు తప్ప ఎవరు సపోర్ట్ చేయలేదట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-72452 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;suman&period;jpg" alt&equals;"what is the important incident happened in suman life " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీంతో సుమన్ మనోవేదనకు గురయ్యారు&period; జైలు నుంచి బయటకు వచ్చినా సరే ఏదో గిల్టీ ఫీలింగ్ తో కుంగిపోయే వారు&period; అప్పటి వరకు ఆయన డేట్స్ కోసం ఎదురుచూసిన నిర్మాతలు&comma; డైరెక్టర్లు అన్ని క్యాన్సిల్ చేసుకున్నారు&period; సుమన్ నిజంగానే తప్పు చేశారని నమ్మేవారు&period; కొంత మంది దీని వెనుక సినిమా స్టార్స్ ఉన్నారని పుకార్లు కూడా వచ్చాయి&period; మరీ ముఖ్యంగా చిరంజీవి హస్తం ఉందని అన్నారు&period; కానీ సుమన్ చిరంజీవి మంచి స్నేహితులు&period; ఇక సుమన్ జైలు నుంచి వచ్చాక అంత ముందులా క్రేజ్ లేకపోవడంతో రెమ్యూనరేషన్ తగ్గిపోయింది&period; చివరికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా&comma;విలన్ గా పాత్రలు చేస్తూ వచ్చారు&period; చిరంజీవి స్థాయిలో ఉండాల్సిన ఆయన చివరికి చేయని నేరానికి జైలు పాలై తన సినీ జీవితమే నాశనం అయింది&period; ఈ విషయాలను సుమన్ పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts