ఆధ్యాత్మికం

గణనాథుడి నుంచి డబ్బు పాఠాలు నేర్చుకోండిలా..!!

సాధారణంగా మనం ఏదైనా పని మొదలు పెట్టాలంటే ముందుగా వినాయకుడికి పూజ చేస్తాం. ఎందుకంటే విఘ్నేశ్వరుడు ఏదైనా విజ్ఞాలు ఉన్న తొలగిస్తాడని భావిస్తారు. అందుకే ఏ పూజ చేసినా ఏ పని చేసిన ముందు పూజించేది విఘ్నేశ్వరున్నె.. కాబట్టి బిజినెస్ డబ్బు విషయంలో మాత్రం తప్పకుండా ఈ విఘ్నేశ్వరుని పాఠాలు నేర్చుకోవాలి.. విఘ్నేశ్వరుని నుంచి పాఠాలు ఏంటి అని అనుకుంటున్నారు కదూ.. అవునండి మీరు విన్నది కరెక్టే.. విఘ్నేశ్వరుని ద్వారా మనం డబ్బు పాఠాలు నేర్చుకుందాం.. ఏంటో ఇప్పుడు చూద్దాం.. ఏదైనా కొత్త పని చేయాలంటే మనం ముందుగా వినాయకుడికి పూజ చేస్తాం.. మనం ఏది చేయాలన్నా అందులో మనం వేసే మొదటి అడుగు చాలా కీలకం. డబ్బు విషయానికి వస్తే మనం పెట్టే తొలి పెట్టుబడి, తొలి అడుగు లాంటిది.. కాబట్టి మీరు చేసే పనిని వినాయక చవితి రోజు ప్రారంభిస్తే మరీ మంచిది.

వినాయకుడిని గజాననుడు అని కూడా పిలుస్తుంటారు.. ఎందుకంటే ఏనుగు తలను ధరించి ఉంటారు.. ఏనుగు తల అనేది తెలివితేటలకు చిహ్నం.. కాబట్టి ఏదైనా పెట్టుబడి పెట్టాలి అనుకున్నప్పుడు మనం తెలివితేటలతో ముందుకు వెళ్లాలి. మనం దేనికి అయితే పెట్టుబడి పెట్టాలి అనుకుంటామో అందులో జ్ఞానం పెంచుకొని మనకు లాభం ఉంటుందా నష్టం ఉంటుందా అనేది గమనించి ముందుకు వెళ్లాలి. లంబోదరునికి పెద్ద చెవులు ఉంటాయి. అందుకే లంబ కర్ణుడు అని పిలుస్తారు. గణేశుడు ప్రతి విషయాన్ని శ్రద్ధగా వింటారని నమ్ముతారు. అలాగే మీరు ఏదైనా పెట్టుబడి పెట్టాలి అనుకున్నప్పుడు దానికి సంబంధించిన విషయాలను, ఫైనాన్షియల్ అడ్వైజర్స్ చెప్పే విషయాలను శ్రద్ధగా వినాలి.

learn these money lessons from lord ganesha

అలాగే గణపతి కళ్ళు చాలా షార్ప్ గా ఉంటాయని నమ్ముతారు. అందుకే గణపతిని విఘ్నేశ్వరుడు అని పిలుస్తారు. ఏకాగ్రత సామర్థ్యానికి చిహ్నం. బిజినెస్ పెట్టే వాళ్ళు ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఏకాగ్రతతో ఇన్వెస్ట్ కు సంబంధించిన విషయాలను చూడాలి. వినాయకుడికి ఒక దంతం విరిగిపోయి ఉంటుంది. అందుకే ఆయనను ఏకదంతాయ అని అంటారు. కాబట్టి బిజినెస్ విషయాలలో ఆచితూచి అడుగు వేయాలి. నష్టాలు వస్తాయి అనుకుంటే దాన్ని వదిలేయాలి. అడ్డంకులను తొలగించుకోవాలి. గణనాధుని విజ్ఞాలను తొలగించే దేవుడు అని పిలుస్తారు. మనం ఏదైనా ఇన్వెస్ట్ చేసే ముందు ఈ విఘ్నాల‌ను తొలగించుకోవాలి. దీని వల్ల ఎలాంటి అడ్డంకులు లేకుండా ఆనందంగా పెట్టిన పెట్టుబడి మళ్ళీ లాభాల్లోకి వెళుతుంది.

Admin

Recent Posts