వినోదం

చిరంజీవి, హీరో నితిన్ అత్తమామ‌లకు ఉన్న రిలేషన్‌ ఇదే !

హీరో నితిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నితిన్ కరోనా టైం లో వివాహం చేసుకున్నాడు. నితిన్ భార్య పేరు శాలిని అన్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. ‘ఇష్క్’ సినిమా టైంలో వీరిద్దరూ కలుసుకున్నారు. ఓ మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా వీరికి పరిచయం ఏర్పడడం, ఆ తర్వాత అది ప్రేమగా మారడం, ఇప్పుడు పెళ్లి వరకు వెళ్లడం జరిగింది.

ఇదిలా ఉండగా నితిన్ భార్య శాలిని కుటుంబానికి, అలాగే మెగాస్టార్ చిరంజీవికి ఓ ప్రత్యేక అనుబంధం ఉందట. వివరాల్లోకి వెళితే, శాలిని తల్లిదండ్రులు అయినా సంపత్ కుమార్, షేక్ నూర్జహాన్ నాగర్, ఇద్దరు డాక్టర్లే. వీళ్లది ప్రేమ పెళ్లి. వీళ్ళు కర్నూల్లో గత 20 ఏళ్లుగా ప్రగతి నర్సింగ్ హోమ్ ను రన్ చేస్తున్నారు. శాలిని తల్లి నూర్జహాన్ నాగర్ కు, చిరంజీవితో మంచి అనుబంధం ఉంది.

what is the relation between chiranjeevi and nithin father in law

2008 ఆగస్టులో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. ఇక 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున కర్నూలు జిల్లా నియోజకవర్గం నుండి నాగర్ ను నిలబెట్టారు చిరంజీవి. కానీ నాగర్ ఓటమి పాలయ్యారు. తర్వాత ఈమె కూడా రాజకీయాలకు దూరమయ్యారని తెలుస్తుంది. అయినప్పటికీ చిరుతో సంపత్, నాగర్ ల స్నేహం కొనసాగుతూనే ఉందని సమాచారం.

Admin

Recent Posts