చిట్కాలు

బ్లాక్‌హెడ్స్ వేధిస్తున్నాయా ? కిచెన్లోకి పదండి..!

ఆరోగ్యవంతమైన, వెలిగిపోయే చర్మం ఎవరికి ఇష్టం ఉండదు? నిగనిగలాడే చర్మం బయటినుంచే కాక, లోపలినుంచి కూడా అందంగా ఉంచుతుంది. అది కావాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిఉంటుంది. ఇంకా జిడ్డు చర్మం కలవారైతే, ఇంకాస్తా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే, జిడ్డు చర్మం చాలా రకాల చర్మవ్యాధులకు అనుకూలంగా ఉంటుంది. మొటిమలు, వైట్హెడ్స్,బ్లాక్‌హెడ్స్ ..ఇలా..

బ్లాక్‌హెడ్స్ బాధ మాత్రం వర్ణనాతీతం. చాలామంది వీటిని తొలగించుకోవడానికి బ్యూటీ క్లినిక్ల చుట్లూ, స్పా ల చుట్టూ తిరుగుతూ, వేలకువేలు ఖర్చు చేస్తున్నారు. సాధారణంగా ఇవి ముక్కు, చెక్కిలి, గడ్డం మీద కూడా వస్తాయి. మన వంటింట్లోని కొన్ని దినుసులతోనే ఈ సమస్యను నియంత్రించవచ్చనేది ఓ పరిశోధనాఫలితం.

wonderful home remedy to reduce black heads

ఇలా తయారుచేసుకోండి..

ఒక అరటిపండు (మెత్తగా గుజ్జులా చేయండి). 2 చెంచాల ఓట్స్ ( పొడి చేయండి). 1 చెంచాడు తేనె

పై మూడింటిని ఒక చిన్న గిన్నెలోకి తీసుకుని, బాగా కలపండి. అంతే, మీ క్రీమ్ తయారయిపోయింది. ఇప్పుడు ఈ పేస్ట్నుబ్లాక్‌హెడ్స్ ఉన్న ప్రాంతంలో పూసి, గుండ్రంగా రుద్దండి.

ఒక 5 నుండి 7 నిమిషాలు అలాగే ఉంచి, తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయండి. మైల్డ్గా ఉండే మాయిశ్చరైజర్ను రాసుకోండి. ఇలా క్రమం తప్పకుండా రోజూ ఈ పేస్ట్ను తగ్గేవరకు వాడండి.బ్లాక్‌హెడ్స్ కు గుడ్ బై చెప్పండి.

Admin

Recent Posts