ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో సాయి పల్లవి ఒకరు. డ్యాన్స్‌తో పాటు అద్భుతమైన పర్‌ఫార్మెన్స్ తో కుర్రాళ్ల మనసులు గెలుచుకున్న లేడి పవర్ స్టార్ సాయి పల్లవి ఈ మధ్య కాలంలో వరుస సినిమాలతో పలకరించిన, అందులో కొన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో కొంత బ్రేక్ తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే అత్యంత సహజంగా కనిపించడానికి ప్రయత్నించే సాయి పల్లవి.. చివరికీ తన మొహంపై ఉన్న మొటిమలను మేకప్‌తో ఏ మాత్రం కవర్ చేసుకోదు. మాములు ప్రజలే వాటిని కవర్ చేసేందుకు నానా క్రీములు రాస్తుంటారు. సాయి పల్లవి కూడా అలా ఎన్నో క్రీములు రాసిన కూడా ఫలితం లేదట.
ఒకానొక సందర్భంలో సాయి పల్లవి తన మొటిమల గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు. తన మొటిమలే తనకు అందం అని తెలిపింది. మొదట్లో అందరిలా తాను బాధపడ్డట్టు చెప్పిన సాయి పల్లవి ప్రస్తుతం ఎలాంటి ఫీలింగ్ లేదంటుంది. అయితే నా మొహం పై ఇలా మొటిమలు ఉన్నప్పటికీ నాకు సినిమా అవకాశాలు వచ్చాయని తెలిపారు. తాను చూసిన హీరోయిన్స్ ముఖంపై చిన్న మచ్చ కూడా ఉండేది కాదని, నా ముఖంపై అన్ని మొటిమలు ఉండడంతో మొదట్లో భయం వేసిందని పేర్కొంది.
ప్రేమమ్ సినిమాలో ఎలాంటి మేకప్ లేకుండా మొటిమలతోనే ఆ సినిమాలో నటించానని తెలిపింది సాయి పల్లవి. ఇలా సినిమాలో నన్ను చూడటం వల్ల ఎంతో మంది అమ్మాయిలకు వారిపై ఆత్మవిశ్వాసం పెరిగిందని సాయి పల్లవి చెప్పుకొచ్చారు. పైకి కనిపించే అందం కంటే క్యారెక్టర్ ముఖ్యమని, అందరూ అదే చూస్తారని అప్పుడు తెలిసిందని చెప్పింది.