వినోదం

Bobbili Puli : ఎన్టీఆర్‌కి పోటీగా అంత మంది వచ్చారా.. నిలిచింది ఎవ‌రు..?

Bobbili Puli : తెలుగు సినిమా చరిత్రలో ఎన్టీఆర్, దాసరి నారాయణ రావు కాంబినేషన్‌లో వచ్చిన ‘బొబ్బలి పులి’ చిత్రం ఎంత సంచ‌ల‌న విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ సినిమా ఎన్టీఆర్ రాజకీయ వేదికగా పునాదిగా నిలిచింది. ఈ సినిమా విడుదల తర్వాత ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కూడా అయ్యారు. అందుకే ఎన్టీఆర్ అభిమానులకే కాదు.. సామాన్య ప్రేక్షకులకు కూడా బొబ్బలిపులి సినిమా అంటే ఓ తీపి జ్ఞాపకం అని చెప్పాలి. బొబ్బిలి పులి చిత్రం ఎన్టీఆర్, దాస‌రి కాంబోలో చివరి సినిమా కావడం విశేషం. ‘బొబ్బిలి పులి’ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోెడిగా శ్రీదేవి, జయచిత్ర నటించారు. ఈ చిత్రంలో శ్రీదేవి ప్రియురాలి పాత్రలో నటిస్తే.. జయచిత్ర భార్య పాత్రలో అలరించారు.

బొబ్బిలి పులి చిత్రానికి జేవి రాఘవులు అద్భుతమైన సంగీతం అందించారు. ఈ చిత్రంలోని పాటలన్ని సూపర్ హిట్. ముఖ్యంగా ఆర్మీ నేపథ్యంలో వచ్చే జననీ జన్మభూమి పాట అప్పటికీ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ దేశ భక్తి గీతంగా నిలిచిపోయింది. ఈ చిత్రం ‘ఒకటో నెంబర్ బస్సు’, తెల్ల చీరలో’, యెడ్డమంటే, ఓ సుబ్బారావు, సంభవం పాటలు అన్ని మ్యూజికల్ ఛార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి. అయితే బొబ్బిలి పులి సినిమాకి పోటీగా ప‌లు సినిమాలు విడుద‌ల అయ్యాయి. ఇందులో ముందుగా ఏఎనఆర్ న‌టించిన గోపాల‌క కృష్ణుడు సినిమా ఉంది.ఇందులో పాట‌లు విశేషంగా ఉంటాయి. ఇక ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది.

which movies competed with bobbili puli movie

ఇక కృష్ణ న‌టించిన నివురుగ‌ప్పిన నిప్పు కూడా బొబ్బిలి పులి సినిమాకి విడుద‌లైంది.ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వచ్చిన ఈ చిత్రం ఫ్లాప్ గా నిలిచింది. ఇక బొబ్బ‌లి పులి రిలీజ్ అయిన త‌ర్వాత ఇది పెళ్లంటారా అనే సినిమా రిలీజైంది. చిరంజీవి హీరోగా వ‌చ్చిన ఈ సినిమా మంచి మెసేజ్‌తో వచ్చిన కూడా బొబ్బ‌లి పులి ప్ర‌భంజ‌నానికి నిలవ‌లేక‌పోయింది. చివ‌రిగా చెప్పుకునే చిత్రం ప్రతీకారం. శోభ‌న్ బాబు హీరోగా వ‌చ్చిన ఈ చిత్రం బొబ్బ‌లి పులి త‌ర్వాతే విడుద‌లైన ఈ చిత్రం ఫ్యామిలీ డ్రామాగా రూపొంది మంచి విజ‌యాన్ని సాధించింది.

Admin