వినోదం

Movies : ఎన్‌టీఆర్‌కి వ్య‌తిరేకంగా.. కృష్ణ తీసిన సినిమాలు ఇవే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Movies &colon; అప్పట్లో నటరత్న ఎన్టీఆర్&comma; సూపర్ స్టార్ కృష్ణ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది&period; పైగా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక వీరిద్దరి మధ్య చాలా వార్ నడిచింది&period; ఏకంగా ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా సినిమాలు తీసి వదిలారు కృష్ణ&period; నిజానికి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన కొత్తలో కృష్ణ తీసిన ఈనాడు మూవీ ఎన్టీఆర్ పార్టీ విజయానికి దోహద పడింది&period; ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీలో కృష్ణ చేరడంతో ఎన్టీఆర్ విధానాలను ఎండగడుతూ డైరెక్ట్ సినిమాల‌ను కృష్ణ తీశారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ఆహ్వానం మేరకు కాంగ్రెస్ లో కృష్ణ చేరారు&period; అనంత‌రం రాష్ట్రంలో అధికారంలో ఉన్న‌ ఎన్టీఆర్ తెలుగుదేశం ప్రభుత్వ విధానాలను తూర్పార బడుతూ à°ª‌లు మూవీల‌ను తీశారు&period; సింహాసనం&comma; నా పిలుపే ప్రభంజనం&comma; మండలాధీశుడు&comma; సాహసమే నా ఊపిరి&comma; గండిపేట రహస్యం వంటి సినిమాల‌ను తీశారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-55934 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;krishna&period;jpg" alt&equals;"which movies krishna made against sr ntr " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎన్టీఆర్ తరచూ వాడే కొన్ని ఊతపదాలను యథాతధంగా వాడుతూ తీసిన ఈ సినిమాల్లో సింహాసనం మూవీకి కృష్ణ తొలిసారి దర్శకత్వం వహించడం విశేషం&period; కొన్ని సినిమాల‌ను విజయనిర్మల డైరెక్ట్ చేశారు&period; అయితే మండలాధీశుడు వంటి సినిమాల్లో కృష్ణ గెస్ట్ గా చేసి&period;&period; వేరే వాళ్లతో నటింపజేసి కృష్ణ స్వయంగా సినిమా తీయడం మరో విశేషం&period; ఇలా à°ª‌లు మూవీల‌ను కృష్ణ అప్ప‌ట్లో ఎన్‌టీఆర్‌కు వ్య‌తిరేకంగా తీశారు&period; అయితే అప్ప‌ట్లో కృష్ణ కాంగ్రెస్‌లో చేరినందువ‌ల్లే&period;&period; ఆయ‌à°¨ ఎన్‌టీఆర్‌కు à°¬‌ద్ద à°¶‌త్రువు అయ్యార‌ని చెబుతారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts