వినోదం

మహేష్-నమ్రత పెళ్లికి కృష్ణ ఒప్పుకోకుంటే… ఇందిరాదేవి ఒప్పించారట !

సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి అప్ప‌ట్లోనే చ‌నిపోయిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో బాధపడిన‌ ఆమె హైదరాబాద్ లోని తన నివాసంలో కన్నుమూశారు.

అయితే ఇందిరా దేవి గురించి రూమర్స్ కూడా మీడియాలో ఎప్పుడు రాలేదు. ఆమె చనిపోయాక మాత్రం చాలా వచ్చాయి. కృష్ణ, విజయనిర్మలను వివాహం చేసుకున్న తర్వాత ఆమె ఒంటరిగానే ఉన్నారు. విజయనిర్మలతో పిల్లలు వద్దని ఇందిరాదేవి ఒప్పుకున్న తర్వాతనే కృష్ణ పెళ్లి చేసుకున్నారు. కృష్ణ, విజయనిర్మలను వివాహం చేసుకున్న తర్వాత ఇందిరతో నలుగురు బిడ్డలకు కృష్ణ తండ్రి అయ్యారు. అయితే విజయనిర్మలతోనే కృష్ణ కలిసి ఉండేవారు. ఇది ఇలా ఉంచితే, ఇందిరా దేవి ఎక్కువగా పిల్లలతోనే ఉన్నారు. వారి బాధ్యతలను ఆమె స్వయంగా చూసుకుని ఉన్నత చదువులు చదివించారు.

why krishna not agreed to mahesh babu and namrata marriage

అందరి వివాహాలను దగ్గర ఉండి చేశారు. మహేష్ బాబు, నమ్రతను ప్రేమించి పెళ్లి చేసుకోవడం కృష్ణకు నచ్చలేదు. ముంబైలో పెళ్లి చేసుకున్నారు అని తెలిసి ఆయన చాలా బాధపడ్డారట. తెలుగు అమ్మాయిని మహేష్ బాబుకి ఇచ్చి చేయాలని చూశారు. ఆయన పట్టు వదలకపోవడంతో స్వయంగా ఇందిరా దేవి జోక్యం చేసుకొని కృష్ణను ఒప్పించారు. కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు మరణించే వరకు ఆయన వద్దనే ఉన్నారు ఇందిరాదేవి. రమేష్ బాబు మరణించాక మానసికంగా ఆమె కృంగిపోయారు అని సన్నిహితులు అన్నారు.

Admin

Recent Posts