Nagarjuna : సాధారణంగా సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు పెద్దగా హైలైట్ కావు. మంచి, చెడులు అనేవి చాలా సీక్రెట్‌గా ఉంటాయి. అక్కినేని కోడలిగా దగ్గుబాటి లక్ష్మీమంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున కి ఉన్న క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా సినీ ప్రేక్షకులకి తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే నటుడు నాగార్జున సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చి టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయినప్పటికీ తన కుటుంబం పరపతిని ఏమాత్రం ఉపయోగించుకోకుండా సినిమా ఇండస్ట్రీలో అవకాశాలకోసం ప్రయత్నించి టాప్ హీరోగా ఎదిగాడు. ఆయన ప్రస్తుతం సినిమాలతో పాటు బిగ్ బాస్ షోని హోస్ట్ చేస్తున్నాడు.
నాగార్జున 1986వ సంవత్సరంలో ప్రముఖ దర్శకుడు వి.మధుసూదనరావు దర్శకత్వం వహించిన “విక్రమ్” అనే చిత్రం ద్వారా తన సినీ కెరీర్ ని ఆరంభించాడు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడంతో హీరో నాగార్జున కి సినిమా అవకాశాలు క్రమక్రమంగా బాగానే వరించాయి. ఆ క్రమంలోనే స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగాడు. అయితే నాగార్జున కెరీర్ పరంగా దూసుకుపోయిన కూడా పర్సనల్ లైఫ్ లో చాలా స్ట్రగుల్స్ ఎదుర్కొన్నాడు. టాలీవుడ్ మన్మథుడు నాగార్జున రెండో భార్య అమల గురించి చాలా మందికి తెలుసు. కానీ నాగార్జున మొదటి భార్య, నాగచైతన్య తల్లి దగ్గుబాటి లక్ష్మి గురించి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు.
అయితే దగ్గుబాటి లక్ష్మీతో నాగార్జున ఎందుకు విడిపోయి అమలని ఎందుకు పెళ్లి చేసుకున్నారు అనే విషయం చాలా మందికి తెలియదు. వివరాలలోకి వెళితే దగ్గుబాటి లక్ష్మి చిన్ననాటి నుండే అమెరికాలో పెరిగటంతో పాటూ అక్కడే చదువుకున్నారు. రామానాయుడు ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో అక్కినేని నాగేశ్వరావు తో మంచి అనుబంధం ఏర్పడింది. ఆ తర్వాత వీరిద్దరూ వియ్యంకులు కూడా అవ్వాలనుకున్నారు. ఈ క్రమంలోనే తన కూతురిని లక్ష్మీని నాగార్జునకి ఇచ్చి పెళ్లి జరిపించారు రామానాయుడు. ఈ క్రమంలో అమెరికాలో ఉన్న లక్ష్మీని ఇండియాకు రప్పించి చెన్నైలో వీరిద్దరి వివాహం జరిపించారు. వివాహం తర్వాత నాగార్జున లక్ష్మీ దంపతులకు నాగచైతన్య జన్మించారు. పెళ్లి తరవాత లక్ష్మి ఇండియాలో ఉండడానికి ఇబ్బంది పడ్డారట. దాంతో అమెరికాకు వెళదామని అక్కడే స్థిర పడదామని నాగార్జునతో చెప్పారట. నాగార్జున హీరోగా సినిమాల్లో ఉన్న నేపథ్యంలో అమెరికాకు వెళ్లి అక్కడ స్థిరపడటానికి ఇష్టపడలేదు. దాంతో ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో విడాకులు తీసుకున్నారు. అదే సమయంలో సినిమాల్లో నటిస్తున్న అమలతో పరిచయం ఏర్పడడం, అది ప్రేమగా మారడంతో పెళ్లి పీటలెక్కడం వారద్దరికి అఖిల్ జన్మించడం జరిగింది.