Swimming : శరీరాన్ని ఆరోగ్యంగా, ధృడంగా ఉంచుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొందరు ఆటలు ఆడుతూ ఉంటారు. కొందరు జిమ్ లో వ్యాయామాలు చేస్తారు. మరికొందరు ఈత కూడా కొడతారు. ఇలా ఎవరికి నచ్చింది వారు చేస్తూ ఉంటారు. అయితే అన్నింటికంటే ఈత కొట్టడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ ఈత కొట్టడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని వారు సూచిస్తున్నారు. ఈత కొట్టడం వల్ల మన శరీరానికి కలిగే మేలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈత కొట్టడం వల్ల రక్తనాళాలు మరియు గుండె బలంగా తయారవుతాయి.
అలాగే ఈత కొట్టే వారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు 50 శాతం తక్కువగా ఉంటాయని నిపుణుల పరిశోధనల్లో వెల్లడైంది. అలాగే రక్తపోటు కూడా అదుపులో ఉంటుందని వారు చెబుతున్నారు. అలాగే ఈత కొట్టడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. ఆస్థమా వంటి ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులతో బాధపడే వారు ఈత కొట్టడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ఈత కొట్డడం వల్ల శరీరంలో ప్రతి అవయవం కదులుతుంది. దీంతో శరీరం బలంగా, ధృడంగా తయారవుతుంది. అలాగే మనలో కొందరు మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు వాకింగ్, రన్నింగ్, బరువులు ఎత్తడం వంటి వ్యాయామాలు చేయలేరు. అలాంటి వారు ఈత కొట్టడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
అదే విధంగా బరువు తగ్గాలనుకునే వారికి ఈత కొట్టడం అనేది చక్కటి వ్యాయామం అని చెప్పవచ్చు. ఈత కొట్టడం వల్ల క్యాలరీలు వేగంగా ఖర్చు అవుతాయి. శరీరంలో జీవక్రియల రేటు పెరుగుతుంది. ఈత కొట్టడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈత కొట్టడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తగ్గుతాయి.
శరీరంలో ఉష్ణోగ్రతలు అదుపులో ఉంటాయి. అలాగే ప్రతి వయసు వారు ఈత కొట్టవచ్చు. కనుక ఏ వయసు వారికైనా ఇది చక్కటి వ్యాయామని చెప్పవచ్చు. అలాగే ఇతర వ్యాయామాలు చేయడం వల్ల దెబ్బలు తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే ఈత కొట్టడం వల్ల దెబ్బలు తగిలే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈత కొట్టడం వల్ల ఈ విధంగా మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి ఇది చక్కటి ఫలితాలను అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు.