స్కూల్‌లో చిన్న తనంలో చాలా మంది గోడ కుర్చీ వేసే ఉంటారు. హోం వర్క్ చేయకపోయినా, స్కూల్ కు రాకపోయినా, మార్కులు సరిగ్గా తెచ్చుకోకపోయినా.. టీచర్లు గోడ కుర్చీ వేయిస్తుంటారు. అయితే నిజానికి ఇది ఒక వ్యాయామం. దీన్ని రోజూ 5 నిమిషాల పాటు చేయడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
* గోడ కుర్చీ వ్యాయామాన్ని రోజూ 5 నిమిషాల పాటు చేయడం వల్ల కండరాలు దృఢంగా మారుతాయి. వెన్నెముక ఆరోగ్యంగా ఉంటుంది. వెన్ను నొప్పి తగ్గుతుంది.
* గోడ కుర్చీ వేయడం వల్ల క్యాలరీలు ఎక్కువగా ఖర్చవుతాయి. దీంతో బరువు తగ్గవచ్చు. హృదయ సంబంధ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
* ఈ వ్యాయామం వల్ల కాళ్లలో ఉండే కండరాలు దృఢంగా మారుతాయి. పిక్కలు పటిష్టంగా మారుతాయి.
* ఈ వ్యాయామం చేస్తే పొట్ట వద్ద ఉండే కండరాలు దృఢంగా మారుతాయి. పొట్ట తగ్గుతుంది.
* ఒత్తిడి, ఆందోళనలతో బాధపడేవారు ఈ వ్యాయామం చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి.