ద‌గ్గు, జ‌లుబు నుంచి క్ష‌ణాల్లో ఉప‌శ‌మ‌నం పొందాలంటే.. ఈ 11 చిట్కాల‌ను పాటించండి..!

సీజన్లు మారినప్పుడల్లా సహజంగానే దగ్గు, జలుబు వస్తుంటాయి. వీటిని తగ్గించుకునేందుకు చాలా మంది ఇంగ్లిష్‌ మెడిసిన్‌ను వాడుతుంటారు. కానీ వాటిని వాడాల్సిన పనిలేకుండా సహజసిద్ధమైన పద్ధతిలోనే ఆ సమస్యల నుంచి బయట పడవచ్చు. మరి అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!

ద‌గ్గు, జ‌లుబు నుంచి క్ష‌ణాల్లో ఉప‌శ‌మ‌నం పొందాలంటే.. ఈ 11 చిట్కాల‌ను పాటించండి..!

1. ఒక టీస్పూన్‌ పసుపు, మిరియాల పొడి, తేనెలను కలిపి ఆ మిశ్రమాన్ని రోజుకు మూడు సార్లు తీసుకోవాలి.

2. తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని ఒక కప్పు మోతాదులో రోజుకు 2 సార్లు తాగాలి.

3. ఉసిరికాయ జ్యూస్‌ను పరగడుపునే 30 ఎంఎల్‌ మోతాదులో తాగాలి. పైనాపిల్, నిమ్మ, కివీ పండ్లను తినాలి.

4. ఒక లీటర్‌ నీటిలో 7-8 తులసి ఆకులు, చిన్న అల్లం ముక్క, రెండు వెల్లుల్లి రెబ్బలు, ఒక టీస్పూన్‌ వాము, ఒక టీస్పూన్‌ మెంతులు, చిటికెడు పసుపు, 4-5 మిరియాలు వేసి బాగా మరిగించాలి. నీరు సగం అయ్యాక దాన్ని ఒక కప్పు మోతాదులో ఉదయం, సాయంత్రం తాగాలి. దగ్గు, జలుబు తగ్గుతాయి.

5. చల్లని నీళ్లకు బదులుగా వేడి నీళ్లను తాగుతుండాలి. స్నానానికి కూడా వేడి నీళ్లను ఉపయోగించాలి.

6. ఒక గ్లాస్‌ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా తేనె కలిపి రోజుకు మూడు సార్లు తీసుకోవాలి. దీని వల్ల గొంతు సమస్యలు తగ్గుతాయి.

7. అల్లం, పసుపు వేసి మరిగించిన నీటిలో నిమ్మరసం కలిపి రోజుకు రెండు సార్లు ఒక కప్పు మోతాదులో తాగాలి.

8. వాము గింజలు, యూకలిప్టస్‌ ఆయిల్‌, పసుపు వేసి నీటిని బాగా మరిగించి ఆ నీటితో ఆవిరి పడుతుండాలి.

9. రాత్రి పూట గ్లాస్‌ గోరు వెచ్చని పాలలో కొద్దిగా మిరియాల పొడి లేదా పసుపు వేసి తాగాలి.

10. సైంధవ లవణాన్ని గోరు వెచ్చని నీటిలో వేసి బాగా కలిపి ఆ నీటిని గొంతులో పోసి పుక్కిట పడుతుండాలి.

11. తులసి ఆకులు నాలుగైదు, కొద్దిగా అతి మధురం చూర్ణం కలిపి తీసుకోవాలి.

ఈ చిట్కాలను పాటించడం వల్ల దగ్గు, జలుబు తగ్గుతాయి. అలాగే భస్త్రిక, అనులోమ విలోమ, భ్రమ్రి ప్రాణాయామ వంటి వ్యాయామాలను చేస్తే ఫలితం ఉంటుంది.

Share
Admin

Recent Posts