వ్యాయామం

జిమ్ లో వ్యాయామాలు చేస్తున్నారా..? వీటిని తప్పక పాటించండి.. లేదంటే సమస్య‌లు వ‌స్తాయి..!

చాలామంది ప్రతి రోజు కూడా ఆరోగ్యంగా ఉండాలని వ్యాయమ పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. కొంతమంది ఇళ్లల్లో వ్యాయామ పద్ధతుల్ని పాటిస్తే, కొంత మంది జిమ్ కి వెళ్తూ ఉంటారు. మీరు కూడా రోజూ జిమ్ కి వెళ్తున్నారా..?, వ్యాయామం చేస్తున్నారా..? అయితే కచ్చితంగా ఈ విషయాలని మీరు గుర్తుపెట్టుకోవాలి. వీటిని కనుక మీరు పాటించినట్లయితే సమస్యలు ఏమీ లేకుండా ఉండొచ్చు. మీరు వ్యాయామం చేయడానికి ముందు, అదే విధంగా చేసిన త‌రువాత‌ కొన్ని పద్ధతుల్ని అనుసరించాలి.

ఈ ఆరోగ్య చిట్కాల‌ను పాటిస్తే ఇవి మిమ్మల్ని రక్షిస్తాయి. వ్యాయామం చేసినప్పుడు చెమట ఫుల్లుగా పడుతుంది. అయితే చెమట పట్టినప్పుడు వ్యాయామం చేస్తూ మీకే తెలియకుండా మీరు టీ షర్ట్ తో మొత్తం చెమటనే తుడిచేసుకుంటూ ఉంటారు. ఎప్పుడూ అలా చేయకండి. కేవలం డ్రై క్లీన్ టవల్ తో ముఖాన్ని, తలని తుడుచుకోండి. పొడి టవల్ ద్వారా చెమటని క్లీన్ చేసుకోవాలి. సో, ఈసారి మీరు కనుక జిమ్ కి వెళ్తే క‌చ్చితంగా ఒక మంచి టవల్ ని తీసుకు వెళ్ళండి.

if you are doing exercises in gym then follow these tips

ఇంట్లో కానీ జిమ్‌లో కానీ వ్యాయామం చేసేటప్పుడు ముందు అక్కడ వ్యాయామ పరికరాలని శుభ్రం చేసుకోండి. ఆ పరికరాలకు సూక్ష్మ క్రిములు ఉంటాయి. అందుకోసం మీరు శుభ్రపరచడానికి ఒక స్ప్రే ని కానీ ఏదైనా లిక్విడ్ ని కానీ తీసుకువెళ్లి క్లీన్ చేసుకోండి. ఆ తర్వాత మాత్రమే మీరు జిమ్ చేయడం మొదలు పెట్టండి.

టవల్స్, వాటర్ బాటిల్స్, ఫోన్లు వంటి వాటిని జిమ్ లో షేర్ చేసుకోవడం వలన బ్యాక్టీరియా, ఫంగస్ వంటివి చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ వస్తువులని ఇతరులతో పంచుకోకండి. వెంటనే చేతులు కడుక్కుంటూ ఉండండి. క్రిములు, టాక్సిన్స్ దాడి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదంటే శానిటైజర్ ని ఉపయోగించండి. ఇలా జిమ్ లో మీరు ఈ పద్ధతుల్ని పాటించినట్లయితే కచ్చితంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రావు.

Admin

Recent Posts