వినోదం

Viral Photo : అమ్మతో కలిసి ఫోటోకు ఫోజులిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? ఈమె ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్..!

Viral Photo : సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత తమ చిన్ననాటి ఫోటోలు షేర్ చేస్తూ తారలు అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు. ప్రస్తుతం ఒక హీరోయిన్ షేర్ చేసిన ఫోటో ఒకటి నెట్టింట బాగా వైరల్ అవుతుంది. అమ్మని కౌగిలించుకొని క్యూట్ స్మైల్ తో ఆకట్టుకుంటున్న ఈ చిన్నారి ప్రస్తుతం స్టార్ హీరోయిన్. ఈమె ఎవరో గుర్తుపట్టండి చూద్దాం.. ఆమె అందానికి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. ఆమె మేని చాయ చూస్తే పాలలో ముంచి తీసిన శిల్పంలా ఉంటుంది. ఆమె డాన్స్ చేస్తూ నడుము వయ్యారింగా తిప్పిందంటే నెలవంక డాన్స్ చేస్తుందా అన్నట్లుగా ఉంటుంది. ఇప్పటికైనా గుర్తుపట్టారా..

ఆ ఫోటోలో కనిపించే ముద్దులొలికే చిన్నారి ఇంకెవరో కాదు.. మిల్కీ బ్యూటీ తమన్నా. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ ట్యాగ్ ను సొంతం చేసుకుంది తమన్నా. దాదాపు తెలుగులో స్టార్ హీరోలు అందరి సరసన నటించింది ఈ మిల్కీ బ్యూటీ. తెలుగుతో పాటు తమిళ్ లో కూడా తమన్నా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది. కానీ వర్కౌట్ కాలేదు. ఇటీవల కాలంలో తమన్నా జోరు కాస్త తాగిందనే చెప్పాలి. బాహుబలి సినిమా తర్వాత తమన్నా కాస్త నెమ్మదిగా సినిమాలు చేస్తూ వస్తుంది.

tamannaah childhood photo viral

ముంబయిలో పుట్టిన తమన్నా అక్కడే చదువు పూర్తి చేసింది. 2005లో 15 సంవత్సరాల వయస్సులోనే హిందీలో చాంద్ సా రోషన్ చెహ్రాలో లీడ్ రోల్ వెండి తెరపైకి అడుగుపెట్టింది. అదే సంవత్సరం ఆమె శ్రీ చిత్రంతో తెలుగు చలనచిత్రసీమకు రంగప్రవేశం చేసింది. కానీ శ్రీ మూవీ ప్లాఫ్ కావడంతో తమన్నాకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఇక శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన హ్యాపీడేస్ లో ఓ హీరోయిన్ గా చేసిన తమన్నాకు బాగా క్రేజ్ వచ్చింది. కానీ ఆ తరువాత కూడా అడపాదడపా చిన్న సినిమాలు చేసింది. ఇక సుకుమార్ దర్శకత్వంలో నాగచైతన్యతో కలిసి నటించిన‌ 100 % లవ్ చిత్రంతో తమన్నా దశ తిరిగిపోయింది.

అప్పటి వరకు చిన్న సినిమాల్లో హీరోయిన్ గా చేసిన తమన్నా.. ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అల్లు అర్జున్ తో బద్రీనాథ్, రామ్ చరణ్ తో రచ్చ చిత్రాల్లో హీరోయిన్ గా చేసింది. ఆ తర్వాత తెలుగు స్టార్ హీరోలందరితోనూ దాదాపు కలిసి నటించింది. ప్రస్తుతం కథానాయికగా మాత్రమే కాకుండా నెగిటివ్ రోల్స్, వెబ్ సిరీసులు కూడా చేస్తూ బిజీగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్, సత్యదేవ్ గుర్తుందా శీతాకాలం చిత్రాలతో తమన్నా హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది. ఇక సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉండే తమన్నా ప్రస్తుతం తన లేటెస్ట్ ఫోటోలతో రెచ్చగొడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

Admin

Recent Posts