Chicken Majjiga Pulusu : చికెన్ మజ్జిగ పులుసును ఎప్పుడైనా తిన్నారా.. ఇలా చేయాలి..!

Chicken Majjiga Pulusu : మ‌నం చికెన్ తో ర‌క‌ర‌కాల వంట‌కాలను త‌యారు చేస్తూ ఉంటాము. చికెన్ తో వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది చికెన్ ను ఇష్టంగా తింటారు. త‌రుచూ చేసే వంట‌కాలే కాకుండా చికెన్ తో మం చికెన్ మ‌జ్జిగ పులుసును కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. చికెన్ తో చేసే ఈ మ‌జ్జిగ పులుసు చాలా రుచిగా ఉంటుంది. ఒక్క‌సారి రుచి మ‌ళ్లీ ఇది కావాలి అని అడ‌గాల్సిందే. ఈ మ‌జ్జిగ పులుసును త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. చికెన్ తో ఎంతో రుచిగా ఉండే చికెన్ మ‌జ్జిగ పులుసును ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

చికెన్ మ‌జ్జిగ పులుసు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చికెన్ ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – పావు క‌ప్పు, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 4, క‌రివేపాకు – 2 రెమ్మ‌లు, త‌రిగిన పెద్ద ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, అర గంట పాటు ఉప్పు నీటిలో నాన‌బెట్టిన చికెన్ – పావుకిలో, ప‌సుపు – అర టీ స్పూన్,ఉప్పు – త‌గినంత‌, ప‌చ్చిమిర్చి – 10, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్.

Chicken Majjiga Pulusu recipe in telugu make in this method
Chicken Majjiga Pulusu

మ‌జ్జిగ పులుసు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

పెరుగు – అర‌కిలో, నీళ్లు – 100 ఎమ్ ఎల్, నూనె – ఒక టేబుల్ స్పూన్, మెంతులు – పావు టీ స్పూన్, ఎండుమిర్చి – 2, ఆవాలు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్.

చికెన్ మ‌జ్జిగ పులుసు త‌యారీ విధానం..

ముందుగా చికెన్ ఫ్రైను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం ముందుగా జార్ లో ప‌చ్చిమిర్చి వేసి పేస్ట్ లాగా చేసుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి త‌రువాత ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత చికెన్ వేసి క‌ల‌పాలి. త‌రువాత ఉప్పు, ప‌సుపు వేసి క‌ల‌పాలి. ఈ చికెన్ మ‌ధ్య‌స్థ మంట‌పై వేయించాలి. చికెన్ స‌గానికి పైగా వేగిన త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న ప‌చ్చిమిర్చి పేస్ట్ వేసి క‌ల‌పాలి.

చికెన్ పూర్తిగా వేగిన త‌రువాత గ‌రం మ‌సాలా వేసిఒక నిమిషం పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ చికెన్ ను పూర్తిగా చ‌ల్లారే వ‌ర‌కు ప‌క్కకు ఉంచాలి. త‌రువాత మ‌జ్జిగ పులుసు త‌యారీకి పెరుగును ఉండ‌లు లేకుండా బాగా క‌ల‌పాలి. త‌రువాత ఇందులో నీళ్లు, ఉప్పు, ప‌సుపు వేసి క‌లిపి ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత తాళింపుకు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత మిగిలిన ప‌దార్థాలు వేసి వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత ఈ తాళింపును ముందుగా త‌యారు చేసుకున్న మ‌జ్జిగ‌లో వేసిక‌ల‌పాలి. త‌రువాత చికెన్ ఫ్రైను వేసి క‌ల‌పాలి.దీనిని అర‌గంట‌పాటు అలాగే ఉంచి ఆ త‌రువాత స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ మ‌జ్జిగ పులుసు త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది.

Share
D

Recent Posts