Categories: Featured

క్వినోవా లేదా బ్రౌన్ రైస్‌.. అధిక బ‌రువు త‌గ్గేందుకు రెండింటిలో ఏది మంచిదంటే..?

ప్ర‌స్తుతం అనే మందిలో ఆరోగ్యం ప‌ట్ల శ్ర‌ద్ధ పెరిగింది. అందులో భాగంగానే వారు త‌మ ఆరోగ్యాన్ని ప‌దిలంగా ఉంచుకోవ‌డం కోసం బ్రౌన్ రైస్‌, క్వినోవా వంటి ఆహారాల‌ను తీసుకుంటున్నారు. అధిక బ‌రువు త‌గ్గేందుకు కూడా కొంద‌రు వీటిని ఆప్ష‌న్లుగా ఎంచుకుంటున్నారు. అయితే క్వినోవా లేదా బ్రౌన్ రైస్‌.. అధిక బ‌రువు త‌గ్గేందుకు రెండింటిలో ఏది స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తుంది ? దేన్ని తీసుకోవాలి ? అంటే…

brown rice quinoa adhika baruvuku edi manchidi

క్వినోవాలో మ‌న శ‌రీరానికి అవ‌సరం అయ్యే అనేక పోష‌కాలు ఉంటాయి. ఒక క‌ప్పు ఉడ‌క‌బెట్టిన క్వినోవా ద్వారా మ‌న‌కు సుమారుగా 220 క్యాల‌రీల శ‌క్తి ల‌భిస్తుంది. వాటిలో సుమారుగా 72 శాతం నీరు, 20 గ్రాముల పిండి ప‌దార్థాలు, 4 గ్రాముల ప్రోటీన్లు, 3 గ్రాముల ఫైబ‌ర్‌, 2 గ్రాముల ఫ్యాట్ ఉంటాయి. అందువ‌ల్ల మ‌న‌కు చ‌క్క‌ని పోష‌ణ ల‌భిస్తుంది.

క్వినోవాల‌ను తీసుకోవడం వ‌ల్ల వృక్ష సంబంధ ప్రోటీన్లు ల‌భిస్తాయి. ఇవి మ‌న శ‌రీరంలో కండ‌రాల నిర్మాణానికి, రోగ నిరోధ‌క శ‌క్తికి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అలాగే మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతుంది, కొలెస్ట్రాల్ స్థాయిలు, షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. క్వినోవాలో మెగ్నిషియం, ఐర‌న్‌, జింక్‌, పొటాషియంలు పుష్క‌లంగా ఉంటాయి. అందువ‌ల్ల టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న‌వారికి క్వినోవా మంచి ఆహారం అని చెప్ప‌వ‌చ్చు. దీని వ‌ల్ల డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది. క్వినోవాలో ఉండే పోష‌కాలు నిద్ర‌లేమి స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డేస్తాయి. అలాగే వీటిలో ఉండే ఐర‌న్ ఎర్ర ర‌క్త క‌ణాలు స‌రిగ్గా ప‌నిచేసేందుకు, మెద‌డు ప‌నితీరుకు ఉప‌యోగ‌ప‌డుతుంది.

ఇక క్వినోవాలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాల వ‌ల్ల ఇవి జీర్ణాశ‌యానికి ఎంత‌గానో మేలు చేస్తాయి. క్వినోవాల‌ను ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌గా, లంచ్ లేదా డిన్న‌ర్ స‌మ‌యంలోనూ తీసుకోవ‌చ్చు. కానీ వీటిల్లో మెగ్నిషియం ఎక్కువ‌గా ఉంటుంది క‌నుక క్వినోవాను రాత్రి పూట తింటే మంచిది. దీని వ‌ల్ల మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంది. త్వ‌ర‌గా నిద్ర‌వ‌స్తుంది. నిద్ర‌లేమి నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

ఇక క్వినోవా లాగే బ్రౌన్ రైస్‌లోనూ అనేక పోష‌కాలు ఉంటాయి. వీటిల్లో పిండి ప‌దార్థాలు ఎక్కువ‌గా ఉంటాయి క‌నుక మ‌న శ‌రీరానికి త‌గినంత శ‌క్తి ల‌భిస్తుంది. అలాగే ఫైబ‌ర్ ఎక్కువ‌గా ల‌భిస్తుంది. దీంతో ఆక‌‌లి నియంత్ర‌ణ‌లో ఉండి అధిక బ‌రువు త‌గ్గేందుకు స‌హాయ ప‌డుతుంది. బ్రౌన్ రైస్ తిన‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం ప‌దిలంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గుతాయి. మ‌న మెట‌బాలిజం మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో ఎక్కువ‌గా ఉంటుంది క‌నుక ఆ స‌మ‌యంలో బ్రౌన్ రైస్ తింటే మంచిది.

అయితే అధిక బ‌రువు విష‌యానికి వ‌స్తే క్వినోవానే ఉత్త‌మ‌మైన ఆహారం అని చెప్ప‌వ‌చ్చు. అధిక బ‌రువు త‌గ్గాల‌ని అనుకునే వారికి పోష‌కాలు ఎక్కువ‌గా ఉండే ఆహారాలు కావాలి. క‌నుక ఆ విష‌యంలో క్వినోవా ఉత్త‌మ‌మైన ఆహారం. కాబ‌ట్టి అధిక బ‌రువు త‌గ్గాల‌ని అనుకునే వారు క్వినోవా తీసుకోవడం మంచిది. అయితే బ‌రువు త‌గ్గాల్సిన ప‌నిలేద‌ని అనుకునేవారు, బ‌రువు నియంత్ర‌ణ‌లో ఉంటే చాలు అని అనుకునే వారు బ్రౌన్ రైస్ తిన‌వ‌చ్చు. ఇక క్వినోవా తిన్నాక కొంద‌రికి అల‌ర్జీ వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. ఆ స‌మ‌యంలో క‌డుపు నొప్పి, దుర‌ద‌లు, వాంతులు కావ‌డం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. ఇలాంటి స‌మ‌స్య వ‌చ్చిన వారు క్వినోవా తిన‌రాదు. వారు త‌మ‌కు క్వినోవా అల‌ర్జీ ఉన్న‌ట్లు గ్ర‌హించాలి. అలాంటి వారు క్వినోవా తిన‌కుండా బ్రౌన్ రైస్ తింటే మంచిది. దాంతో బ‌రువును నియంత్ర‌ణ‌లో ఉంచుకోవ‌చ్చు.

Share
Admin

Recent Posts