Featured

అధిక బరువు తగ్గేందుకు 7 రోజులు ఈ డైట్‌ పాటించి చూడండి.. డాక్టర్లు సూచిస్తున్న బెస్ట్‌ డైట్‌..!

అధిక బరువును తగ్గించుకునేందుకు అనేక రకాల డైట్‌లు అందుబాటులో ఉన్నాయి. కీటోడైట్‌, మెడటరేనియన్‌ డైట్‌.. ఇలా చాలా డైట్‌లను పాటించవచ్చు. అయితే అధిక బరువు తగ్గేందుకు ఇంకో డైట్‌ కూడా ఉపయోగపడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. అదే డ్యాష్‌ డైట్‌ (DASH Diet). దీంతో అధిక బరువును తగ్గించుకోవడంతోపాటు ఆరోగ్యంగా ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు.

dash diet can reduce your weight

డ్యాష్ డైట్‌.. దీని పూర్తి పేరు Dietary Approaches to Stop Hypertension.. హైబీపీ ఉన్న‌వారి కోసం ప్ర‌త్యేకంగా ఈ డైట్‌ను రూపొందించారు. అయితే కేవ‌లం బీపీ మాత్ర‌మే కాకుండా ఈ డైట్ వ‌ల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంద‌ని, హార్ట్ స్ట్రోక్స్ రాకుండా ఉంటాయ‌ని, బ‌రువు త‌గ్గుతార‌ని చెబుతున్నారు. ఇక దీంతోపాటు డ‌యాబెటిస్ నుంచి కూడా బయట పడవచ్చని డాక్టర్లు  అంటున్నారు.

మ‌న శ‌రీరంలో మెద‌డు, అంత‌ర్గ‌త అవ‌య‌వాలు, వెంట్రుక‌లు, చ‌ర్మం ఇలా అనేక భాగాల‌కు అవ‌స‌ర‌మైన కాల్షియం, ప్రోటీన్లు, ఫైబ‌ర్ ఈ డైట్ ద్వారా అందుతాయి. దీంతో శ‌రీరానికి సంపూర్ణ పోష‌ణ అందుతుంది. ఈ డైట్‌లో పండ్లు, కూర‌గాయ‌లు, తృణ ధాన్యాలు, ప్రోటీన్లు, డైరీ ఉత్ప‌త్తుల‌ను లిమిట్‌లో తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే తినే ఆహారాల్లో ఉప్పును త‌క్కువ‌గా తీసుకోవాలి.

డ్యాష్ డైట్ నియమాలు ఇవే

1. రోజుకు 2 లీట‌ర్ల నీటిని కచ్చితంగా తాగాలి.

2. రోజుకు 5 సార్లు తినాలి. ఒకసారి తింటే 200 గ్రాముల లోపు ఆహారాన్ని తినాలి.

3. రోజూ తీసుకునే ఆహారం ద్వారా వ‌చ్చే క్యాల‌రీలు 2000 నుంచి 2500 మ‌ధ్య ఉండాలి.

4. వారంలో 5 సార్లు తీపి ప‌దార్థాలు (తేనె, జామ్ మాత్ర‌మే) తిన‌వ‌చ్చు.

5. తృణ ధాన్యాలు, న‌ట్స్‌, బీన్స్‌, మాంసం (చికెన్‌, చేప‌లు, రొయ్య‌లు), కూర‌గాయ‌లు తినాలి.

6. సోడా, ఆల్క‌హాల్ తీసుకోరాదు. పొగ తాగ‌రాదు.

7. రోజుకు 2 సార్లు స్నాక్స్ తీసుకోవ‌చ్చు. ఆక‌లి ఉంటేనే తినాలి. స్నాక్స్‌ అంటే చిరు తిళ్లు కాదు. మొలకెత్తిన విత్తనాలు, గింజలు, నట్స్‌.. ఇలాంటివన్నమాట.

8. రోజువారీ వాడకంలో ఉప్పును బాగా తగ్గించాలి.

9. హోల్‌ వీట్‌ బ్రెడ్‌ను ఆహారంలో తీసుకోవాలి.

10. కొవ్వు ప‌దార్థాలు, ఊర‌గాయ ప‌చ్చ‌ళ్లు, పేస్ట్రీలు, కేకులు, ఇతర బేకరీ పదార్థాలు, నూనె వస్తువులు, జంక్‌ ఫుడ్‌, మ‌ట‌న్ తిన‌రాదు.

ఇవి తీసుకోవచ్చు

1. గోధుమ బ్రెడ్, గంజి

2. డ్రై ఫ్రూట్స్‌, పండ్లు, పండ్ల రసాలు (చక్కెర లేకుండా ఇంట్లో తయారు చేసినవి)

3. ఉడ‌క‌బెట్టిన కూర‌గాయ‌లు

4. ఫ్యాట్ లేని పాలు, పాల ఉత్ప‌త్తులు

5. సీడ్స్‌, బీన్స్‌, న‌ట్స్

6.  ఆలివ్ ఆయిల్‌

7.  తేనె, జామ్‌

8. గ్రీన్ టీ

9. చేప‌లు, కోడిగుడ్లు, చికెన్

తిన‌కూడ‌ని ఆహారాలు

జంక్ ఫుడ్‌, ఫాస్ట్ ఫుడ్‌, చిప్స్‌, మ‌ద్యం, ప్రాసెస్ చేయ‌బ‌డిన ఆహారాలు, మ‌ట‌న్‌, బీఫ్‌, క్యాండీలు, కుకీలు, ఇత‌ర స్వీట్లు, సోడా వంటి ఆహారాల‌ను తీసుకోరాదు.

పైన చెప్పిన ఆహారాల్లో తిన‌కూడ‌ని ఆహారాల‌ను ప‌క్క‌న పెట్టి తినాల్సిన ఆహారాల్లో పైన చెప్పిన వాటిని మోతాదులో తీసుకోవాలి. కాక‌పోతే రోజు వారీ ఆహారంలో అన్ని ప‌దార్థాలు ఉండేలా చూసుకోవాలి. కానీ మోతాదును మించ‌రాదు. అలాగే తినాల్సిన ఆహారం ఎంత తిన్నా దాంతో వ‌చ్చే క్యాల‌రీలు 2000 నుంచి 2500 మ‌ధ్య మాత్ర‌మే ఉండాలి. ఇలా డ్యాష్ డైట్‌ను ప్లాన్ చేసుకోవాలి.

ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక మంది డ్యాష్ డైట్‌ను ఫాలో చేస్తున్నారు. దీంతో అధిక బ‌రువు, మ‌ధుమేహం, హై బీపీ, గుండె జ‌బ్బులు రాకుండా చూసుకోవ‌చ్చ‌ని వైద్యులు చెబుతున్నారు. దీంతోపాటు మ‌న శ‌రీరానికి కావల్సిన కీల‌క పోష‌కాలు అన్నీ ఈ డైట్ ద్వారా మ‌న‌కు ల‌భిస్తాయి. దీంతో శ‌రీరానికి సంపూర్ణ పోష‌ణ అందుతుంద‌ని డాక్ట‌ర్లు అంటున్నారు. మిగిలిన అనేక ర‌కాల డైట్స్ క‌న్నా ఈ డ్యాష్ డైట్ ఎంతో సేఫ్ అని అంటున్నారు.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts