కొలెస్ట్రాల్‌ను త‌గ్గించుకోవాలంటే.. తీసుకోవాల్సిన ఆహారాలు, మానేయాల్సిన ప‌దార్థాలు..!

మ‌న శ‌రీరంలో మంచి కొలెస్ట్రాల్‌, చెడు కొలెస్ట్రాల్ అని రెండు ర‌కాల కొలెస్ట్రాల్స్ ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. మంచి కొలెస్ట్రాల్‌ను హెచ్‌డీఎల్ అంటారు. చెడు కొలెస్ట్రాల్‌ను ఎల్‌డీఎల్ అంటారు. అయితే మ‌నం తినే అనేక రకాల ఆహారాల‌తోపాటు ప‌లు ఇత‌ర కార‌ణాల వ‌ల్ల కూడా మ‌న శ‌రీరంలో ఎల్‌డీఎల్ పేరుకుపోతుంటుంది. ఈ క్ర‌మంలో ఆ కొలెస్ట్రాల్‌ను త‌గ్గించాలంటే మ‌న శ‌రీరంలో త‌గినంత హెచ్‌డీఎల్ ఉండాలి. అందుకు కింద తెలిపిన సూచ‌న‌లు పాటించాల్సి ఉంటుంది.

foods to take to lower cholesterol

1. మ‌ట‌న్ వంటి మాంసాహారాల‌ను తిన‌డం త‌గ్గించాలి. వీటిల్లో ఉండే శాచురేటెడ్ ఫ్యాట్స్ మ‌న శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను పేరుకుపోయేలా చేస్తాయి. దీని వ‌ల్ల గుండె జ‌బ్బులు వ‌చ్చేంద‌కు అవ‌కాశం ఉంటుంది. మ‌ట‌న్ వంటి మాంసాహారాల‌ను తిన‌డం త‌గ్గించ‌డం ద్వారా శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా చూసుకోవ‌చ్చు.

2. నూనె ప‌దార్థాలు, జంక్ ఫుడ్‌, ఇత‌ర చిరుతిళ్ల‌ను తిన‌డం మానేయాలి. వీటి వ‌ల్ల కూడా శ‌రీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. క‌నుక ఈ ఆహారాల‌ను మానేస్తే మంచిది.

3. నిత్యం తీసుకునే పిండి ప‌దార్థాల శాతాన్ని త‌గ్గించాలి. వీటిని అధికంగా తీసుకుంటే శ‌రీరంలో అవి కొవ్వుగా మారి నిల్వ ఉంటాయి. దీంతో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. క‌నుక నిత్యం అవ‌స‌రం ఉన్న మోతాదు మేర‌కే పిండి ప‌దార్థాల‌ను తీసుకోవాల్సి ఉంటుంది.

4. ఫైబ‌ర్ (పీచు ప‌దార్థం) అధికంగా ఉండే ఆహారాల‌ను నిత్యం తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

5. దానిమ్మ‌, సోయా, ఉసిరి, వెల్లుల్లి వంటి ఆహారాల‌ను నిత్యం తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా ఉంటుంది. దీంతోపాటు హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి.

6. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువ‌గా ఉండే చేప‌లు, అవిసె గింజ‌లు వంటి ఆహారాల‌ను తీసుకోవ‌డం ‌వ‌ల్ల కూడా శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ ను త‌గ్గించుకోవ‌చ్చు.

7. ఆంథోస‌య‌నిన్‌లు ఎక్కువ‌గా ఉండే వంకాయ‌, ఎరుపు రంగు క్యాబేజీ, ప‌ర్పుల్ క‌ల‌ర్ మొక్క‌జొన్న‌, బ్లూ బెర్రీలు, బ్లాక్ బెర్రీలు.. వంటి ఆహారాల‌ను ఎక్కువ‌గా తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ త‌గ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

8. నిత్యం వ్యాయామం చేయ‌డం వ‌ల్ల కూడా శ‌రీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను త‌గ్గించుకోవ‌చ్చు.

9. విట‌మిన్ డి ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తిన‌డం వ‌ల్ల లేదా తాజా పండ్లు, కూర‌గాయ‌ల‌ను ఎక్కువ‌గా తిన‌డం వ‌ల్ల కూడా శ‌రీరంలో ఉండే కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గుతాయి.

10. పసుపును, విట‌మిన్ ఇ ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను నిత్యం తింటున్నా కొలెస్ట్రాల్ ను త‌గ్గించుకోవచ్చు.

Share
Admin

Recent Posts